మంత్రి గీతారెడ్డికి సీబీఐ సమన్లు!
రాష్ట్రమంత్రి జే గీతారెడ్డికి సీబీఐ సమన్లు జారీ చేసింది. లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూకేటాయింపుల వ్యవహారంలో మంగళవారం గీతారెడ్డిని విచారించే అవకాశం ఉంది. గీతారెడ్డిని విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సీబీఐ అధికారులు లేఖ రాశారు. అయితే గీతారెడ్డిని విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ అధికారులకు అనుమతించారు. గీతారెడ్డిని ఆమె నివాసంలో సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు.
లేపాక్షి నాలెడ్జ్ హబ్ వ్యవహారంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావును కూడా సీబీఐ అధికారులు ఇటీవల ప్రశ్నించిన సంగతి తెలిసిందే.