ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో శుక్రవారం నిర్వహించిన 68వ స్వాతంత్య్ర దినోత్సవానికి రోడ్లు భవనాలశాఖ మంత్రి శిద్దా రాఘవరావు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, కలెక్టర్ విజయకుమార్, జిల్లా ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధి.. భవిష్యత్తులో ప్రగతి పరుగు.. ఎలా ఉంటుందో తన ఉపన్యాసంలో మంత్రి ప్రస్తావించారు. - సాక్షి ప్రతినిధి, ఒంగోలు
పరిశ్రమలు: మొదటి దశలో ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో పరిశ్రమలు స్థాపిస్తున్నాం. ఇప్పటికే 13 వేల ఎకరాల భూమిని గుర్తించాం. దొనకొండ ప్రాంతంలో ప్రభుత్వ భూములు లభ్యంగా ఉండటం వల్ల
అక్కడ పరిశ్రమలు స్థాపన కోసం చర్యలు
తీసుకుంటున్నాం.
పోర్టు, విమానాశ్రయం : రామాయపట్నం, వాడరేవులలో పోర్టుల ఏర్పాటు, ఒంగోలులో విమానాశ్రయం
నెలకొల్పడానికి ప్రయత్నాలు చేస్తున్నాం.
రుణమాఫీ : జిల్లాలో నాలుగు లక్షల మంది రైతులకు 3,600 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తున్నాం.
విద్యుత్తు వెలుగుల కోసం : మెరుగైన విద్యుత్ అందించేందుకు రూ.232 కోట్ల ఖర్చుతో 400 కేవీ సబ్‌స్టేషన్‌ను పొదిలి దగ్గర, రూ.95 కోట్లతో 200 కెవీ సబ్‌స్టేషన్‌ను కందుకూరు వద్ద, రూ. 35 కోట్లతో నాలుగు 131 కెవీ సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నాం. జిల్లాలో రూ.361 కోట్లతో 52 మెగావాట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం.
ఉపాధి
జిల్లాలో జాతీయ పెట్టుబడుల ఉత్పత్తుల మండలి (నిమ్జ్) ఏర్పాటు ద్వారా మొదటి దశలో 60 వేల మందికి ఉపాధి కల్పిస్తాం. ప్రకాశం జిల్లాలో నిమ్జ్ ద్వారా పామూరు, వలేటివారిపాలెం, పెదచెర్లోపల్లి మండలాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఎంపికచేశాం. జిల్లాలో ఇప్పటి వరకూ 2,066 కోట్ల రూపాయల పెట్టుబడితో 70 భారీ, మధ్య తరహా పరిశ్రమల స్థాపన ద్వారా 16,950 మందికి ఉపాధి కల్పించాం. మరో రూ.2,220 కోట్లతో 25 పరిశ్రమలు నెలకొల్పుతున్నాం.
పర్యాటకం : ఒంగోలు పరిసరాల్లో ఆరు కోట్ల రూపాయల ఖర్చుతో శిల్పారామం, కొత్తపట్నం,
వాడరేవు బీచ్‌లలో, గుండ్లకమ్మ జలాశయం వద్ద పర్యాటక కేంద్రాల అభివృద్ధి చేస్తాం.
ఆరోగ్య సేవ : ఎన్టీఆర్ ఆరోగ్య సేవా పథకం ద్వారా పేదలకు, ఉద్యోగులకు, పాత్రికేయులకు రెండున్నర లక్షల రూపాయల వరకూ నగదు రహిత వైద్యం అందించనున్నాం.
జాతీయ రహదారి : 278 కిలోమీటర్ల పొడవుగల మాచర్ల- యర్రగొండపాలెం - మార్కాపురం - కనిగిరి - పామూరు రహదారి, దోర్నాల - శ్రీశైలం రహదారిని జాతీయ రహదారులుగా చేశాం.
పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో 68వ స్వాతంత్య్ర దినోత్సవాలు
Published Sat, Aug 16 2014 3:27 AM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM
Advertisement
Advertisement