'కేంద్రమే పోలవరాన్ని నిర్మించాలి' | center has to complete polavaram project, asks YV SubbaReddy | Sakshi
Sakshi News home page

'కేంద్రమే పోలవరాన్ని నిర్మించాలి'

Published Thu, Mar 10 2016 7:43 PM | Last Updated on Sat, Mar 9 2019 3:59 PM

'కేంద్రమే పోలవరాన్ని నిర్మించాలి' - Sakshi

'కేంద్రమే పోలవరాన్ని నిర్మించాలి'

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ విషయంపై ఏపీకి కేంద్రం ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని లోక్ సభలో ఆయన గురువారం డిమాండ్ చేశారు. పోలవరం నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వమే చేపట్టాలని వ్యాఖ్యానించారు. 2018 లోగా పోలవరం నిర్మాణాన్ని పూర్తిచేయాలన్నారు.

పోలవరం ప్రాజెక్టుకు ఇప్పుడు ఇస్తున్న నిధుల కేటాయింపులు సరిపోవు అని పేర్కొన్నారు. రైతులకు 100 శాతం రుణాలు ఇచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జన్ ఔషధ్ కేంద్రాల ఏర్పాటు అనుకున్న లక్ష్యాలకు తగ్గట్లుగా లేవని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లోక్ సభలో ఈ సమస్యలను లేవనెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement