న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విశాఖలో ఏర్పాటు చేసే సమావేశాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తను ఆహ్వానించడం లేదని వైఎస్‌ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గురువారం రాజ్యసభ ప్రస్తావించారు. సంప్రదాయాలను పాటించడం లేదని, పద్ధతులను విస్మరిస్తున్నారంటూ ఆయన ఈ విషయాన్ని డిప్యూటీ చైర్మన్ కురియన్ దృష్టికి తీసుకు వెళ్లారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకం చేయాలని విజయసాయిరెడ్డి కోరారు. ఎంపీ విజ్ఞప్తిపై స్పందించిన డిప్యూటీ చైర్మన్ స్థానిక సమావేశాలకు ఎంపీలను విధిగా పిలవాల్సిందేనని స్పష్టం చేశారు.
సమావేశాలకు నన్ను ఆహ్వానించాలి: సాయిరెడ్డి
Published Thu, Mar 30 2017 4:13 PM | Last Updated on Thu, May 24 2018 2:18 PM
Advertisement
Advertisement