ఒమిక్స్ గ్రూప్ ఎండీ డాక్టర్ శ్రీనుబాబు వెల్లడి
గ్లోబల్ కేన్సర్ అండ్ మెడికేర్‌పై అంతర్జాతీయ సదస్సు
హైదరాబాద్: ‘‘దేశంలో ఏటా లక్ష మందికి పైగా మహిళలు గర్భాశయ సంబంధ కేన్సర్ బారిన పడుతున్నారు. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. శారీరక సంబంధాలే ఇందుకు ప్రధాన కారణమైనప్పటికీ, వ్యాధి పట్ల ప్రజలకు విస్తృతమైన అవగాహన కల్పించడమే సరైన పరిష్కారం’’ అని ప్రపంచ యువ శాస్త్రవేత్త పురస్కార గ్రహీత, ఒమిక్స్ గ్రూప్ మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ జి.శ్రీనుబాబు పేర్కొన్నారు. ఒమిక్స్ గ్రూప్ ఆధ్వర్యంలో సోమవారమిక్కడి హెచ్‌ఐసీసీలో ‘గ్లోబల్ కేన్సర్ అండ్ మెడికేర్ సమ్మిట్-2014’ పేరిట అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది.
ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనుబాబు మాట్లాడుతూ.. సెర్వికల్ కేన్సర్‌తో పాటు మహిళల్లో బ్రెస్ట్, ఓరల్ క్యావిటీ, ఓవరీ, ల్యూకేమియా, థైరాయిడ్, లింపోమా, ఫర్నిక్స్.. పురుషుల్లో నోటి, గొంతు, కాలేయం, మెదడు తదితర కేన్సర్ కేసులు తరచుగా నమోదవుతున్నాయని వెల్లడించారు. నిమ్స్ మాజీ డెరైక్టర్ డాక్టర్ కాకర్ల సుబ్బారావు మాట్లాడుతూ.. కేన్సర్ పట్ల ప్రజలకు అవగాహన కార్యక్రమాలు, వ్యాధి నివారణలో ఆధునిక ఆవిష్కరణల కోసం ఇటువంటి సదస్సులు ఎంతగానో దోహదపడతాయని అభిప్రాయపడ్డారు.
ఏటా లక్ష మందికి గర్భాశయ కేన్సర్
Published Tue, Sep 16 2014 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 1:25 PM
Advertisement