సత్రం భూములు కొంటే.. తప్పేంటి? | Chalamalasetti ramanujaya comments on Sadavarti Satram lands | Sakshi
Sakshi News home page

సత్రం భూములు కొంటే.. తప్పేంటి?

Published Fri, Jul 1 2016 1:34 AM | Last Updated on Mon, Oct 1 2018 4:15 PM

సత్రం భూములు కొంటే.. తప్పేంటి? - Sakshi

సత్రం భూములు కొంటే.. తప్పేంటి?

చౌకగా వచ్చాయి కాబట్టే కొన్నాం : రామానుజయ

 సాక్షి, విశాఖపట్నం: ‘‘సదావర్తి సత్రానికి చెందిన భూములు చౌకగా వస్తున్నాయి కాబట్టే కొనుగోలు చేశాం.. దాంట్లో తప్పేముంది’’ అని రాష్ర్ట కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ ప్రశ్నించారు. వేలంలో ఇతర పాటదారులు, మీడియా సమక్షంలోనే ఈ భూములను తన కుమారుడు సొంతం చేసుకున్నాడని స్పష్టం చేశారు. ఆయన గురువారం విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడారు.

ఆక్రమణదారుల నుంచి భూములను పరిరక్షించుకోలేక సత్రం పాలకవర్గం వేలం నిర్వహించిందన్నారు. వీటి విలువ మార్కెట్‌లో భారీగానే ఉన్నప్పటికీ వివాదాల కారణంగా తక్కువ ధరకే వేలం వేశారని చెప్పారు. 83 ఎకరాల విక్రయానికి వేలం నిర్వహించారని వెల్లడించారు. ఇతర పాటదారుల మాదిరిగానే తన కుమారుడు కూడా  పాల్గొని, భూములను సొంతం చేసుకున్నాడని చెప్పారు. ఈ వ్యవహారాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement