అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు: సీపీఐ రామకృష్ణ | chandra babu deceiving people, says cpi | Sakshi
Sakshi News home page

అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు: సీపీఐ రామకృష్ణ

Published Fri, Sep 12 2014 1:57 PM | Last Updated on Mon, Aug 13 2018 4:30 PM

chandra babu deceiving people, says cpi

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారంటూ సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ఆయనను నమ్మి ఓట్లు వేసిన ప్రజలను నిండా మోసం చేస్తున్నారని విమర్శించారు.

రుణాల మాఫీ పేరుతో రైతులు, చేనేత కార్మికులు, మహిళలు.. ఇలా అన్ని వర్గాల వారిని చంద్రబాబు మోసం చేసి వంచిస్తున్నారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వైఫల్యాలపై ఈనెల 24వ తేదీన విజయవాడలో వామపక్షాల సమావేశం నిర్వహిస్తామని, అలాగే అక్టోబర్ 10న అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement