
చంద్రబాబుకు కొత్త వాహన శ్రేణి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ లో కొత్త వాహన శ్రేణి వచ్చి చేరింది.
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ లో కొత్త వాహన శ్రేణి వచ్చి చేరింది. ప్రస్తుతం చంద్రబాబు వినియోగించే పార్టున్యుర్ వాహనాల స్థానంలో సఫారీ వాహనాలు దర్శనం ఇవ్వనున్నాయి. దాదాపు రెండు నెలల క్రితం కొనుగోలు చేసిన పార్టున్యుర్ వాహనాలు నచ్చలేదని చంద్రబాబు తాజాగా స్పష్టం చేయడంతో సఫారీ వాహన శ్రేణి ఏర్పాటు చేశారు. అయితే విజయవాడలో ఉన్న పార్టున్యుర్ కాన్వాయ్ ను హైదరాబాద్ లో వినియోగించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది.