'ప్రజలు గురించి మాట్లాడే హక్కు బాబు కోల్పోయారు' | chandra babu naidu has no right to speak about public, says jogi ramesh | Sakshi
Sakshi News home page

'ప్రజలు గురించి మాట్లాడే హక్కు బాబు కోల్పోయారు'

Published Tue, Aug 13 2013 3:35 PM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM

'ప్రజలు గురించి మాట్లాడే హక్కు బాబు కోల్పోయారు' - Sakshi

'ప్రజలు గురించి మాట్లాడే హక్కు బాబు కోల్పోయారు'

విజయవాడ: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేష్ మండిపడ్డారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబులేఖ ఇచ్చినపుడే రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడే హక్కును కోల్పోయారని విమర్శించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సీమాంధ్రలో ఉద్యమం ఊపందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మరోసారి చంద్రబాబును జోగి రమేష్ తూర్పారబట్టారు. సీమాంధ్ర ప్రజానికం గురించి చంద్రబాబు మాట్లాడితే  పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్ ఆత్మలు క్షోభిస్తాయని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజల గురించి ఇక బాబు నోరు మెదపక పోవడం మంచిదని జోగి రమేష్ అభిప్రాయపడ్డారు.

 

సీమాంధ్ర ప్రాంత టీడీపీ నేతలు సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటే తక్షణమే చంద్రబాబు నాయుడుతో రాజీనామా చేయించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జోగి రమేష్ ఆ పార్టీ నేతలను  విజయవాడలో డిమాండ్ చేశారు. ఆ తర్వాతే సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని సీమాంధ్ర టీడీపీ నేతలకు ఆయన సూచించారు. చంద్రబాబు సమైక్యాంధ్రకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్న తర్వాతే సీమాంధ్ర ప్రాంతంలో అడుగుపెట్టాలని జోగి రమేష్ సూచించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement