ఎన్ని కష్టాలొచ్చినా రుణమాఫీ చేస్తాం: చంద్రబాబు | chandra babu participates janmabhumi in anantapur district | Sakshi
Sakshi News home page

ఎన్ని కష్టాలొచ్చినా రుణమాఫీ చేస్తాం: చంద్రబాబు

Published Mon, Oct 6 2014 4:56 PM | Last Updated on Mon, Aug 20 2018 3:02 PM

ఎన్ని కష్టాలొచ్చినా రుణమాఫీ చేస్తాం: చంద్రబాబు - Sakshi

ఎన్ని కష్టాలొచ్చినా రుణమాఫీ చేస్తాం: చంద్రబాబు

అనంతపురం: ఎన్ని కష్టాలొచ్చినా రుణమాఫీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో సోమవారం జరిగిన జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.

కేంద్రం, ఆర్బీఐ సహకరించకపోయినా రైతులకు అండగా ఉంటామని చంద్రబాబు చెప్పారు. 'అనంతపురం జిల్లాను కరువు రహిత జిల్లాగా మారుస్తా. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తా. రాయలసీమను రతనాల సీమ చేస్తా. ఆడబిడ్డలకు ఆర్థికంగా అండగా ఉంటాము. డ్వాక్రా సంఘాలకు మళ్లీ రుణాలిస్తాం. హంద్రీ నీవా ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాదే' అని చంద్రబాబు అన్నారు. అంతకుముందు గరుడాపురంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో కలసి చంద్రబాబు వ్యవసాయ మిషన్ను ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement