janma bhumi
-
నీళ్లు నమిలారు.. నోళ్లు నొక్కారు
చాలాచోట్ల ముగిసిన జన్మభూమి గ్రామసభలు ఏలూరు (ఆర్ఆర్ పేట) : జిల్లాలో ఈ నెల 2న ప్రారంభమైన జన్మభూమి గ్రామసభలు చాలాచోట్ల మంగళవారంతో ముగిశాయి. ఇటు ప్రజాప్రతినిధులు.. అటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సభలు ప్రారంభమైన నాటినుంచి ప్రజలు ప్రతిచోట అధికారులను, ప్రజాప్రతినిధులను నిలదీయడంతో సమాధానం చెప్పలేక కొన్ని ప్రాంతాల్లో వారి నోళ్లు మూయించేందుకు ప్రయత్నించగా.. మరికొన్ని చోట్ల ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. పలుచోట్ల ఎమ్మెల్యేలు రెండుమూడు సభలకు మాత్రమే హాజరయ్యారు. మిగిలిన సభలను స్థానిక ప్రజాప్రతినిధులతో కానిచ్చేశారు. ఉన్నతాధికారులు సైతం జన్మభూమి సభల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. తప్పనిసరి పరిస్థితుల్లో సభలకు హాజరైనవవారు మాత్రం ప్రజలకు సమాధానం చెప్పలేక గుండెలు బిగబట్టుకుని దిక్కులు చూశారు. పింఛన్లు.. ఇళ్ల స్థలాల కోసం నిలదీత జన్మభూమి సభలకు ప్రతిచోట జనం పలుచగా హాజరయ్యారు. పింఛన్లు రద్దయిన వారు కన్నీటి పర్యంతం కాగా.. గత గ్రామసభల్లో పింఛన్లు, ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఈ సభలకు వచ్చి.. తాము పెట్టుకున్న అర్జీలు ఏమయ్యాయంటూ ప్రజాప్రతినిధులు, అధికారులను దులిపేశారు. -
నీళ్లు నమిలారు.. నోళ్లు నొక్కారు
చాలాచోట్ల ముగిసిన జన్మభూమి గ్రామసభలు ఏలూరు (ఆర్ఆర్ పేట) : జిల్లాలో ఈ నెల 2న ప్రారంభమైన జన్మభూమి గ్రామసభలు చాలాచోట్ల మంగళవారంతో ముగిశాయి. ఇటు ప్రజాప్రతినిధులు.. అటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సభలు ప్రారంభమైన నాటినుంచి ప్రజలు ప్రతిచోట అధికారులను, ప్రజాప్రతినిధులను నిలదీయడంతో సమాధానం చెప్పలేక కొన్ని ప్రాంతాల్లో వారి నోళ్లు మూయించేందుకు ప్రయత్నించగా.. మరికొన్ని చోట్ల ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. పలుచోట్ల ఎమ్మెల్యేలు రెండుమూడు సభలకు మాత్రమే హాజరయ్యారు. మిగిలిన సభలను స్థానిక ప్రజాప్రతినిధులతో కానిచ్చేశారు. ఉన్నతాధికారులు సైతం జన్మభూమి సభల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. తప్పనిసరి పరిస్థితుల్లో సభలకు హాజరైనవవారు మాత్రం ప్రజలకు సమాధానం చెప్పలేక గుండెలు బిగబట్టుకుని దిక్కులు చూశారు. పింఛన్లు.. ఇళ్ల స్థలాల కోసం నిలదీత జన్మభూమి సభలకు ప్రతిచోట జనం పలుచగా హాజరయ్యారు. పింఛన్లు రద్దయిన వారు కన్నీటి పర్యంతం కాగా.. గత గ్రామసభల్లో పింఛన్లు, ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఈ సభలకు వచ్చి.. తాము పెట్టుకున్న అర్జీలు ఏమయ్యాయంటూ ప్రజాప్రతినిధులు, అధికారులను దులిపేశారు. -
జన్మభూమి సభల్లో జనాగ్రహం
ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నములుతున్న ప్రజాప్రతినిధులు, అధికారులు సాక్షి ప్రతినిధి, ఏలూరు : జన్మభూమి గ్రామ సభల్లో జనాగ్రహం వెల్లువెత్తుతోంది. ప్రజల నుంచి గతంలో వచ్చిన విన్నపాలను పరిష్కరించకుండా.. కొత్తగా సమస్యలు తెలుసుకుంటామంటూ గ్రామసభలు నిర్వహిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులపై జనం తిరగబడుతున్నారు. దీంతో ప్రజాప్రతినిధులు, అధికారులు భయం భయంగా జన్మభూమి సభల్లో పాల్గొంటున్నారు. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నములుతున్నారు. నరసాపురం నియోజకవర్గంలో సోమవారం నిరసనలు వ్యక్తమయ్యాయి. నరసాపురం మండలం వేములదీవిలో ఏపీ రైతు సంఘం నాయకులు కవురు పెద్దిరాజు, ఎం.రామాంజనేయులు తదితరులు ఆందోళనకు దిగారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు అరగంటపాటు సమావేశం నిలిచిపోయింది. కొవ్వూరు మండలం వాడపల్లిలో 90 ఏళ్ల ఎల్లా వీరమ్మ అనే అంధురాలు నడవలేని స్థితిలో కుటుంబ సభ్యుల సహాయంతో జన్మభూమి సభకు వచ్చింది. తనకు 8 నెలలుగా పింఛను సొమ్ము ఇవ్వడం లేదని వాపోయింది. మద్దూరులో పింఛన్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదని, పారిశుద్ధ్యం పడకేసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అధికారులను, ప్రజాప్రతినిధులను గ్రామస్తులు నిలదీశారు. కొవ్వూరు పట్టణంలో నిర్వహించిన సభలో పింఛన్లు ఇవ్వడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నిడదవోలులో జరిగిన కార్యక్రమంలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డులు ఇచ్చారని.. గత మూడు జన్మభూమి సభల్లో అర్జీలు ఇచ్చిన వారికి ఎందుకు మంజూరు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోపాలపురం నియోజకవర్గంలో పలుచోట్ల జరిగిన సభల్లో రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాల సమస్యలపై అధికారులను ప్రశ్నించగా, సమాధానం చెప్పలేక ఇబ్బందులు పడ్డారు. దేవరపల్లి మండలం యాదవోలు, కురుకూరు గ్రామాల్లో జరిగిన సభల్లో పింఛన్లు, ఇంటిస్థలాల కోసం దరఖాస్తులు అందజేశారు. -
వేదన వినరు.. ఆర్భాటం వదలరు
జన్మభూమి గ్రామ సభల తీరిది సాక్షి ప్రతినిధి, ఏలూరు : జన్మభూమి గ్రామ సభల్లో ప్రజల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సమస్యలతో సతమతమవుతున్న వారి వేదనలు మిన్నంటుతున్నాయి. ప్రజల కోసమే పనిచేస్తున్నట్టు డాంబికాలు పలుకుతూ.. ఆర్భాటాలు చేస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు సమస్యలను, ప్రజల విజ్ఞాపనలను పట్టించుకోవడం లేదు. వయసు మీరినా పింఛన్లు అందక కొందరు, వివిధ కారణాలతో పింఛన్లు తొలగించారని కొందరు ఆవేదన చెందుతున్నా వారికి న్యాయం జరగడం లేదు. ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణానికి రుణాల కోసం అందుతున్న వినతులు బుట్టదాఖలా అవుతున్నాయి. విద్యార్థులతో సభలు రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు ఇవ్వకుండా కేవలం పేర్లు చదివి ముగిస్తుండటంతో సభలకు జనం హాజరు తక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఈ సభలపై అవగాహన కోసం విద్యార్థులను పంపించాలని విద్యాశాఖ రీజినల్ డైరెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో నరసాపురం నియోజకవర్గంలో శనివారం నాటి సభలకు విద్యార్థుళణు తీసుకొచ్చారు. నరసాపురం 22వ వార్డులో ఇళ్ల స్థలాలకోసం మహిళలు అధికారులను ప్రశ్నించారు. నరసాపురం మండలం చామకూరి పాలెంలో సింగోడియన్ భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంపై ఎంపీటీసీ బొక్కా రాధాకృష్ణ అధికారులను నిలదీశారు. గత జన్మభూమి సభలో సమస్య పరిష్కరిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. తణుకు మండలం మండపాకలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఎదుట పలువురు నిరసన తెలిపారు. గ్రామంలో రజకచెరువు పాడైందని, రెండేళ్లుగా ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కావడం లేదని రజకులు నిరసన వ్యక్తం చేశారు. అత్తిలి మండలం కంచుమర్రులో నిర్వహించిన గ్రామ సభలో 70 ఏళ్ల వృద్ధురాలు సొమ్మసిల్లి పడిపోయింది. గతనెల పింఛను డబ్బులు రాలేదని అడిగేందుకు వచ్చిన పడిపోగా, అక్కడే ఉన్న వైద్యసిబ్బంది సపర్యలు చేశారు. కంచుమర్రులో తాగునీటి సమస్యపై అధికారులను నిలదీశారు. పశువులకు చెరువు, తాగునీటి చెరువు పక్కపక్కనే ఉండటంతో నీళ్లు కలుషితమవుతున్నాయని వాపోయారు. చెరువు తవ్వుతామని ఏడాది క్రితం హామీ ఇచ్చినా అమలు కావడంలేదని తమ నిరసన తెలిపారు. కొవ్వూరు మండలం కాపవరంలో తనకు పింఛను రావడం లేదని పసుపులేటి వెంకటలక్ష్మి అనే మహిళ జన్మభూమి సభలో విలపించింది. పెంటపాడు గ్రామ సభలో రైతు సంఘం రాష్ట్ర నాయకుడు నల్లమిల్లి రాఘవరెడ్డిని వేదికపైకి పిలవకపోవడంతో ఆయన సభను బహిష్కరించారు. ఈనాం భూ సమస్యలపై మాట్లాడేందుకు వచ్చిన ఆయనకు జన్మభూమి అధికారుల నుండి సరైన గౌరవం దక్కక పోవడంతో వెనుదిరిగారు. ఉపసర్పంచ్ గోపిరెడ్డిని, మండల వ్యవసాయాధికారిని వేదికపైకి ఆహ్వానించలేదు. టి.నరసాపురం మండలం తిరుమలదేవిపేటలో గ్రామసభ రసాభాస అయ్యింది. టీడీపీ, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల మధ్య అభివృద్ధి విషయంలో వాదులాటల నడుమ ప్రారంభమైన ఘర్షణ ఒక దశలో తోపులాటకు దారితీసింది. కాళ్ల మండలం జువ్వలపాలెంలో నివాస ప్రాంతాల వద్ద చేపల చెరువుల తవ్వకాన్ని నిలిపివేయాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్థానికులు నినాదాలు చేశారు. -
ప్రశ్నల వర్షం
- సమస్యలపై ఎక్కడికక్కడ నిలదీస్తున్న జనం - నీటి కోసం ప్రభుత్వవిప్ను అడ్డుకున్న తెలుగు తమ్ముళ్లు అనంతపురం అర్బన్ : ప్రభుత్వం చేపట్టిన జన్మభూమి– మా ఊరు కార్యక్రమం జిల్లాలో మొక్కుబడి తంతుగా సాగుతోంది. సమస్యలపై సభల్లో ప్రజల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం జిల్లావ్యాప్తంగా జరిగిన జన్మభూమి సభల్లో పలు చోట్ల ఇదే పరిస్థితి కొనసాగింది. - శింగనమల మండలం చాలవేములలో జన్మభూమి కార్యక్రమానికి ప్రభుత్వ విప్, స్థానిక ఎంఎల్ఏ యామినీబాల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభం కాగానే ఓబులాపురం టీడీపీ కార్యకర్తలు, రైతులు 29వ డిస్ట్రిబ్యూటరీకి హెచ్ఎల్సీ నీరు విడుదల చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లేందుకు యత్నించారు. అయితే టీడీపీ నేతలు దానికి అడ్డుతగలడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే ప్రసంగాన్ని కూడా అడ్డుకున్నారు. ఇరు వర్గాలకు పోలీసులు నచ్చచెప్పారు. నీరు వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. - గుంతకల్లు మునిసిపాలిటీలోని వార్డుల్లో నిర్వహించిన జన్మభూమి సభలు జనం లేక వెలవెలబోయాయి. మండలంలోని వెంకటాంపల్లిలో సమస్యలపై చుట్టుముట్టిన ప్రజలకు సమాధానం చెప్పక అధికారులు నీళ్లునమిలారు. ఉన్నఫలంగా సభలను ముగించి వెళ్లిపోయారు. పామిడి, గుత్తి మండలాల్లోనూ జన్మభూమి సభలు మొక్కబడిగా సాగాయి. - అర్హులైన వారికి పింఛన్ల తొలగించారంటూ బ్రహ్మసముద్రం మండలం బైరానితిప్పలో జరిగిన జన్మభూమి గ్రామసభను వైఎస్సార్సీపీ నాయకులు , కార్యకర్తలు అడ్డుకున్నారు. - సమస్యలపై ప్రజాప్రతినిధులను, అధికారులను మడకశిర, కందిరేపల్లి, మెళవాయిలో జన్మభూమి గ్రామసభల్లో ప్రజలు నిరసన తెలిపారు. - అర్హులైన తమకు పింఛన్లు ఇవ్వాలంటూ కణేకల్ మండలం రచ్చుమర్రి జన్మభూమిలో అధికారులను ప్రజలు నిలదీశారు. వృద్ధురాలికి అస్వస్థత ఓడీ చెరువు : జన్మభూమి గ్రామసభకు హాజరైతేనే పింఛన్ ఇస్తామన్న పాలకుల హుకుం ఓ వృద్ధురాలిని అస్వస్థతకు గురించేసింది. ఓడీ చెరువు మండలంలోని పెద్దగుట్లపల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు సంజీవమ్మకు రెండు నెలలగా పింఛన్ రాలేదు. జన్మభూమి కార్యక్రమానికి హాజరైతేనే పింఛన్ ఇస్తామని అధికారులు చెప్పడంతో ఆమె సున్నంపల్లికి వచ్చింది. ఎంత సేపటికీ పింఛన్ ఇవ్వకపోవడంతో కార్యక్రమంలోనే సొమ్మసిల్లి పడిపోయింది. వెంటనే ఆమెకు అక్కడే వైద్య శిబిరంలో చికిత్సలు చేయించిన అనంతరం పింఛన్ అందించారు. ఎంపీడీఓకు వేదిక పై చోటు లేదా? నల్లచెరువు: మండల పరిధిలోని కె పూలకుంటలో శుక్రవారం జరిగిన జన్మభూమి–మాఊరు కార్యక్రమంలో వేదికపైన కూర్చోడానికి ఎంపీడీఓ మగ్బుల్బాషాకు చోటులేదా అని వచ్చిన ప్రజలు చర్చించుకున్నారు. ఈ కార్యక్రమానికి హిందూపురం ఎంపీ నిమ్మల క్రిష్టప్ప, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌లు హాజరయ్యారు. కాగా వేదిక పై తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు సైతం వేదికపై కూర్చోవడంతో ఎంపీడీఓకు చోటు లేకపోవడంతో సమావేశం ముగిసే వరకు అలానే ఓ చివరన నిలబడ్డాడు. -
నిరసనలు.. నిలదీతలు
పోలీస్ బందోబస్తు నడుమ జన్మభూమి గ్రామసభలు పింఛనుదారులే సభికులు కలెక్టర్‌పై ధ్వజమెత్తిన పితాని సమస్య చెప్పిన వ్యక్తిపై నోరుపారేసుకున్న బూరుగుపల్లి సాక్షి ప్రతినిధి, ఏలూరు : ప్రజల నిరసనలు.. నిలదీతల నడుమ జన్మభూమిమా ఊరు కార్యక్రమం జిల్లాలో సోమవారం మొదలైంది. నిరసనలు వెల్లువెత్తుతాయని ముందే ఊహించిన ప్రభుత్వం గ్రామ సభల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. తొలి రోజున నిర్వహించిన సభల్లో ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులకు సంబంధించి ధరఖాస్తులు స్వీకరించారు. గడచిన జన్మభూమి సభల్లో ఇళ్ల స్థలాల కోసం ఇచ్చిన దరఖాస్తులకు ఎలాంటి హామీలు లభించలేదు. మొక్కుబడిగా కొందరికి రేషన్ కార్డులు ఇచ్చారు. చాలాచోట్ల కార్డులు అందుబాటులోకి రాకపోవడంతో పేర్లు చదివి మమ అనిపించారు. తొలిరోజే ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ కలెక్టర్ కాటంనేని భాస్కర్ తీరుపై ఆక్షేపణ వ్యక్తం చేశారు. కలెక్టర్ తీరు అర్థరహితంగా ఉందని, దీనివల్ల కొన్ని పంచాయతీలకు సొంత భవనాలు లేక పరాయి పంచన నిర్వహించాల్సి వస్తోందంటూ గ్రామసభలో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దొంగరావిపాలెం, సిద్ధాంతం, రామన్నపాలెం, తామరాడల్లో నిర్వహించిన జన్మభూమి సభల్లో మాట్లాడిన పితాని ప³ంచాయతీ భవనాల నిర్మాణానికి జిల్లాలో కొత్త పొకడ అవలంభిస్తున్నారని ధ్వజమెత్తారు. పంచాయతీ భవన నిర్మాణాలకు 30 శాతం స్థానికుల భాగస్వామ్యం కావాలంటూ నిర్మాణాలకు మోకాలడ్డుతున్నారని వివరించారు. పోలవరం మండలం మామిడిగొందిలో తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని, అందుకే తాము జన్మభూమికి రావడం లేదని అక్కడి ప్రజలు స్పష్టం చేశారు. సమస్యలు పరిష్కరిస్తామని తహసీల్దార్ ఎం.ముక్కంటి నచ్చచెíప్పి సమావేశం నిర్వహించారు. బుట్టాయగూడెం మండలం దొరమామిడిలో రేషన్ కార్డులు ఇవ్వటం లేదంటూ ప్రజలు అదికారును నిలదీశారు. ప్రతి జన్మభూమిలో తన పేరు చదువుతున్నా ఇప్పటివరకూ రేషన్ కార్డు రాలేదంటూ కొమరవరం గ్రామానికి చెందిన తెల్లం శారామణి అవేదన వ్యక్తం చేసింది. తన బిడ్డ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని, వైద్యం చేయించాలన్నా ఇతర పనులకు దేనికైనా కార్డు జిరాక్స్ అడుగుతున్నారని వాపోయింది. కార్డు కోసం దరఖాస్తు చేసుకుని కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకోరా? కార్డు ఇవ్వరా అంటూ నిలదీసింది. నరసాపురం 3వ వార్డులో ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మాట్లాడుతుండగా మూపితి లక్ష్మి అనే మహిళ మాట్లాడుతూ ఎన్నిసార్లు తిరిగినా తనకు వితంతు పింఛను ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేసింది. కొత్త నవరసపురంలో వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ ఈదా జోన్సీ గ్రామంలో అభివృద్ధి పనులు ఎందుకు చేయడం లేదని నిలదీశారు. ఎమ్మెల్యే పాల్గొన్న గొంది గ్రామసభలో కనీసం టెంట్ వేయకపోవడంతో ఎండలోనే జనం కూర్చున్నారు. సమస్యలపై జనానికి పెద్దగా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, జాగ్రత్తలు తీసుకుని మొక్కుబడిగా సభలు ముగించారు. చంద్రన్న బీమా కోసం అంటూ డ్వాక్రా కమ్యూనిటీ అర్గనైజర్లు ఒక్కొక్కరి నుంచి అదనంగా రూ.5 వసూలు చేశారని యలమంచిలిలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడికి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ద్వారకా తిరుమల మండలం రామసింగవరంలో పోలీసు బందోబస్తు మధ్య జన్మభూమి ఏంటంటూ గ్రామస్తులు ప్రజాప్రతినిధులను నిలదీశారు. అడుగడుగునా గ్రామస్తులకు పోలీసులు అడ్డుతగలడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జన్మభూమి కార్యక్రమంలో రేషన్ కార్డులు పంపిణీ చెయ్యకుండా మళ్లీ పేర్లు మాత్రమే చదవడంపై జీలుగుమిల్లి మండలం గంగన్నగూడెం, ములగలంపల్లి గ్రామాల ప్రజలు నిలదీశారు. ప్రజా సమస్యలపై అడిగితే అరెస్టు చేయించేందుకు కూడా ప్రజాప్రతినిధులు వెనకాడటం లేదు. పెరవలి మండలం ఖండవల్లిలో శ్మశానాని స్థలం కేటాయించాలని, బెల్ట్ షాపులను తొలగించాలని అడిగిన గ్రామస్తుడిపై నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు నోరు పారేసుకున్నారు. ’నన్నే అడుగుతావా.. జాగ్రత్త’ అని హెచ్చరించడమే కాకుండా ఎస్సైని పిలిచి ’ముందు ఇతణ్ణి అరెస్ట్ చెయ్. ఫిర్యాదు నేను ఇస్తా’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా పింఛన్లు, ఇళ్ల స్థలాలు ఎందుకు ఇవ్వడం లేదంటూ రాష్ట్ర మంత్రి పీతల సుజాతను చింతలపూడిలో మహిళలు చుట్టుముట్టి నిలదీశారు. -
'ఏ ఒక్క సమస్యా పరిష్కారం కాలేదు..'
విజయనగరం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బొండపల్లిలో జరిగిన మూడో విడత జన్మభూమి కార్యక్రమంలో చుక్కెదురైంది. మొదటి, రెండు విడతల జన్మభూమి కార్యక్రమాల్లో పరిష్కరించిన సమస్యలను చెప్పాలంటూ సభకు హాజరైన రైతులను ఆయన ప్రశ్నించారు. అయితే ఏ ఒక్క సమస్యా పరిష్కారం కాలేదంటూ వారు మండిపడ్డారు. 967 ఖాతాలకు సంబంధించి ఒకే ఒక్క బిల్లు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రత్యేక క్యాంప్ నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌ను ఈ సందర్భంగా చంద్రబాబు ఆదేశించారు. కాగా, ఖరీఫ్ ధాన్యాన్ని నేరుగా తమ వద్దకే వచ్చి కొనుగోలు చేయాలని రైతులు సీఎంకు విజ్ఞప్తి చేశారు. -
'జన్మభూమి వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదు'
కమలాపురం: తెలుగుదేశం ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన జన్మభూమి సభల వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని కమలాపురం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన కమలాపురంలో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధికారం చేపట్టిన నాటి నుండి రాష్ట్రంలో ఏ ఒక్క సమస్యనూ పరిష్కరించలేదని, రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ప్రజల సమస్యలు పరిష్కరించనప్పుడు జన్మభూమి సమావేశాల వల్ల ప్రయోజనం ఏమిటని ఆయన ప్రశ్నించారు. -
రేపు సీఎం రాక
సిరిపురం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం జిల్లాకు రానున్నారు. పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలం ఆరిపాక గ్రామంలో సాయంత్రం జరిగే ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. జన్మభూమి కార్యక్రమం ముగింపు దశకు వచ్చినందున ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని అధికారులను ఇన్చార్జి కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కార్యక్రమ ఏర్పాట్లపై శనివారం సమీక్షించారు. బడి పిలుస్తోంది కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం ఉన్నందున అందుకు ఏర్పాట్లు చేయాలని డీఈవో ఎం.వెంకట కృష్ణారెడ్డి, ఎస్ఎస్ఏ పీవో బి.నగేశ్‌లను ఆదేశించారు. పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని గతంలోలా కాకుండా వినూత్న రీతిలో నిర్వహించాలని వ్యవసాయశాఖ జేడీ లీలావతిని ఆదేశించారు. నీరు-చెట్టు కార్యక్రమంలో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేయాలని డుమా పీడీకి సూచించారు. పేదరికంపై గెలుపు కార్యక్రమంలో భాగంగా పెన్షన్లు అందించడంతో పాటు ముఖ్యమంత్రి వారితో మాట్లాడేందుకు వీలుగా కొంతమంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఈ నెల 17వతేదీన జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపడుతున్నామని ఇన్చార్జి కలెక్టర్ తెలిపారు. సమావేశంలో అదనపు జాయింట్ కలెక్టర్ వెంకటరెడ్డి, డీఆర్డీఏ పీడీ సత్యసాయిశ్రీనివాస్, జెడ్పీ సీఈవో మహేశ్వర్‌రెడ్డి, డీఎంఎండ్‌హెచ్‌వో రెడ్డి శ్యామల, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎ.కృష్ణారావుతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
''ఎన్ని కష్టాలొచ్చినా రుణమాఫీ చేస్తాం''
-
ఎన్ని కష్టాలొచ్చినా రుణమాఫీ చేస్తాం: చంద్రబాబు
అనంతపురం: ఎన్ని కష్టాలొచ్చినా రుణమాఫీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో సోమవారం జరిగిన జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. కేంద్రం, ఆర్బీఐ సహకరించకపోయినా రైతులకు అండగా ఉంటామని చంద్రబాబు చెప్పారు. 'అనంతపురం జిల్లాను కరువు రహిత జిల్లాగా మారుస్తా. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తా. రాయలసీమను రతనాల సీమ చేస్తా. ఆడబిడ్డలకు ఆర్థికంగా అండగా ఉంటాము. డ్వాక్రా సంఘాలకు మళ్లీ రుణాలిస్తాం. హంద్రీ నీవా ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాదే' అని చంద్రబాబు అన్నారు. అంతకుముందు గరుడాపురంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో కలసి చంద్రబాబు వ్యవసాయ మిషన్‌ను ప్రారంభించారు.