
'ఏ ఒక్క సమస్యా పరిష్కారం కాలేదు..'
విజయనగరం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బొండపల్లిలో జరిగిన మూడో విడత జన్మభూమి కార్యక్రమంలో చుక్కెదురైంది. మొదటి, రెండు విడతల జన్మభూమి కార్యక్రమాల్లో పరిష్కరించిన సమస్యలను చెప్పాలంటూ సభకు హాజరైన రైతులను ఆయన ప్రశ్నించారు. అయితే ఏ ఒక్క సమస్యా పరిష్కారం కాలేదంటూ వారు మండిపడ్డారు. 967 ఖాతాలకు సంబంధించి ఒకే ఒక్క బిల్లు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో ప్రత్యేక క్యాంప్ నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ను ఈ సందర్భంగా చంద్రబాబు ఆదేశించారు. కాగా, ఖరీఫ్ ధాన్యాన్ని నేరుగా తమ వద్దకే వచ్చి కొనుగోలు చేయాలని రైతులు సీఎంకు విజ్ఞప్తి చేశారు.