బాబు వచ్చె బాబు పోయే
ఎన్నికలకు ముందు నిరుద్యోగులపై హామీల వర్షం
అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగులను తొలగిస్తున్న వైనం
వందలాది మంది ఉద్యోగులతొలగింపునకు రంగం సిద్ధం
నిరుద్యోగులకు భృతి హామీ గాలికి
నెల్లూరు: బాబు వస్తే జాబు అంటూ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన టీడీపీ నిరుద్యోగుల ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చింది. సీఎం పీఠాన్ని అధిష్టించిన చంద్రబాబు హామీని తుంగలో తొక్కి ఉన్న ఉద్యోగాలనే ఊడగొట్టి యువతను నడివీధిలోకి నెట్టేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో బాబును నమ్మి టీడీపీకి ఓట్లేసిన వేలాది కుటుంబాలు వీధిన పడనున్నాయి. ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీల వర్షం కురిపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటికో ఉద్యోగం కల్పిస్తానని నమ్మించారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని కూడా చెప్పారు. ఉద్యోగాలు ఇవ్వడం ఆలస్యమైతే నెలకు రూ.2 వేలు చొప్పున నిరుద్యోగ భృతి అందిస్తానని ప్రకటించారు. ఈ హామీలను నమ్మిన జనం ముఖ్యంగా యువత టీడీపీవైపు పెద్దఎత్తున మొగ్గుచూపారు. అయితే సీఎం పీఠం అధిష్టించిన మరుక్షణమే చంద్రబాబు అసలు నైజం బయటపడింది. ఎన్నికల హామీలను తుంగలో తొక్కి తన విశ్వరూపాన్ని చూపుతున్నారు. కొత్త ఉద్యోగాలు కల్పించే సంగతి పక్కనపెడితే ఉన్న ఉద్యోగాలను కూడా ఊడబెరకడం ప్రారంభించారు. మొదట ఆయన కన్ను ఆదర్శ రైతులపై పడింది. జిల్లాలో 2006 నుంచి గూడూరు టౌన్: ఇంటికో ఉద్యోగం ఇస్తానని ప్రజల ఓట్లు కొల్లగొట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇచ్చిన హామీని విస్మరించారు. ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయసును రెండేళ్లు అదనంగా పెంచి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడుతాయని ఆశగా ఎదురుచూస్తున్న వారికి చంద్రబాబు సర్కారు తీరు ఆందోళనకు గురిచేస్తోంది.
సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఆ పార్టీ గెలవడంతో ఇక తమ కష్టాలు తొలగిపోతాయని నిరుద్యోగులు భావిం చారు. అయితే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన ఉద్యోగ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచుతూ సంతకం చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు కరువై నిరుద్యోగ సమస్య తీవ్రమవుతోంది. ఈ క్రమంలోనే ఉద్యోగ విరమణ వయసును ప్రభుత్వం రెండేళ్లు పెంచడంపై నిరుద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న మధ్యవయస్కులు కూడా తమకు ఉద్యోగోన్నతులు రావడంలో ఆలస్యమవడంతో పాటు ఆర్థిక ప్రయోజనాలకు నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు.
ఎదురుచూపులే..
ఇంజనీరింగ్, మెడికల్, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సులు పూర్తిచేసిన వారు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు రాక దిగాలు చెందుతున్నారు. ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయకపోవడంతో రోజూ పత్రికలు, ఎంప్లాయిమెంట్ వార్తలు చూసి విసుగు చెందుతున్నారు. ఐటీ, ఫార్మా కంపెనీలన్నీ హైదరాబాద్‌లోనే ఉండడం, విభజన నేపథ్యంలో ఆ నగరం తెలంగాణ రాష్ట్రంలోకి వెళ్లడంతో యువతకు నిరాశను మిగిల్చింది. ప్రొఫెషనల్ కోర్సులు చేసినా ఉద్యోగాలు రాకపోవడం, మరోవైపు వయసు మీరిపోతుండడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి, తీరా అధికారంలోకి వచ్చాక ఏరుదాటి తెప్పతగలేసిన చందంగా చంద్రబాబు వ్యహరిస్తున్నాడని మండిపడుతున్నారు. మరోవైపు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపునకు సన్నాహాలు జరుగుతుండడం మరింత గందరగోళానికి తెరదీస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని యువత కోరుతోంది.
. వీరికి ఏడాదిగా జీతాలు కూడా సక్రమంగా అందడం లేదు. అయితే వీరిని గత ప్రభుత్వం నియమించిందనే సాకుతో తొలగించాలని చంద్రబాబు నిర్ణయించారు. బాబు తీరుతో ఆదర్శరైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వారి కుటుంబాలు వీధినపడే పరిస్థితి నెలకొంది. మరోవైపు జాతీయ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లదీ అదే పరిస్థితి. జిల్లాలో 921 మంది ఫీల్డ్ అసిస్టెంట్లుగా వ్యవహరిస్తుండగా ఇప్పటికే వారిలో పలువురిని తొలగించడంతో ప్రస్తుతం 541 మంది కొనసాగుతున్నారు. వీరిపైనా వేటు వేసేందుకు చంద్రబాబు సన్నాహాలు చేస్తున్నారు. ఇక కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులైతే తమ ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు.
తీరా చూస్తే వీరిని సైతం తొలగించేందుకు చంద్రబాబు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దీంతో వివిధ శాఖల్లో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వందలాది మంది కుటుంబాలు వీధిన పడే పరిస్థితి నెలకొంది. ఇక నిరుద్యోగ భృతి అంశం ప్రస్తావనే ఎక్కడా కనిపించడం లేదు. ఎన్నికలకు ముందు ఒకలా, అధికారం దక్కించుకున్న తర్వాత మరోలా వ్యవహరిస్తున్న చంద్రబాబునాయుడు తీరుపై ఉద్యోగులతో పాటు నిరుద్యోగులు కూడా మండిపడుతున్నారు.