టీడీపీ, కాంగ్రెస్‌లది విభజన నాటకం
Published Sun, Jan 12 2014 3:15 AM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM
రాజమండ్రి సిటీ, న్యూస్‌లై న్ :శాసన మండలి సాక్షిగా టీడీపీ, కాంగ్రెస్ ఏకమయ్యాయనే విషయం రాష్ట్ర ప్రజలకు స్పష్టమైందని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. ఆయా పార్టీలది ‘విభజన’ నాటకమని దుయ్యబట్టారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్నది వైఎస్సార్ సీపీ ఒక్కటేనని స్పష్టం చేశారు. శనివారం పార్టీ నగర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సోనియాగాంధీ, దిగ్విజయ్‌సింగ్ చెప్పిన ట్టు చంద్రబాబు నడుచుకుంటున్నారని, ఇందులో భా గంగానే శాసన మండలిలో తెలంగాణ అంశంపై యనమల రామకృష్ణుడు, నన్నపనేని రాజకుమారి తదితరులు నోరు మెదపడం లేదన్నారు. శాసన మండలి సమావేశాలు తొలి రోజుల్లో పోడియం వద్దకు దూసుకె ళ్లిన టీడీపీ ఎమ్మెల్సీలు.. రెండు రోజుల నుంచి నోరు విప్పడం లేదని విమర్శించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే ఆకాంక్షతో వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి నిరంతర పోరాటం సాగిస్తున్నారన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ఇచ్చిన విభజన లేఖను వ్యతిరేకిస్తూ, సమైక్యవాదాన్ని బలపరుస్తూ మరో లేఖ రాయాలని డిమాండ్ చేశారు. 2014 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు తుడిచిపెట్టుకుపోతాయన్నారు.
లబ్ధిదారుల ఫొటోలతో జాబితా బయటపెట్టాలి
రాజమండ్రిలో పేదలకు ఇచ్చే ఇళ్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చినందున.. లబ్ధిదారుల ఫొటోలతో జాబితాను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఆర్‌డీఓ, హౌసింగ్ కార్పొరేషన్ అధికారులతో సంయుక్తంగా సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహిస్తే లబ్ధిదారులు అర్హులో, కాదో తేటతెల్లమవుతుందన్నారు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల పేదల ఇళ్లను కొనుగోలు చేసేందుకు ధనవంతులు వెనుకాడడం లేదన్నారు. దారిద్య్ర రేఖకు దిగువనున్న పేదలకు కేటాయించే ఇంటి ధరను పెంచడం దారుణమన్నారు. ఇప్పటివరకు రూ.1,66,800 ఉన్న ధరను రూ.2,15,800 లకు పెంచుతూ ప్రభుత్వం జీఓ జారీ చేయడం అన్యాయమన్నారు. ఇది పేదలకు మరింత భారం అవుతుందని చెప్పారు. సమావేశంలో పార్టీ నగర కోఆర్డినేటర్ బొమ్మన రాజ్‌కుమార్, బీసీసెల్ రాష్ట్ర సభ్యుడు మార్గాని రామకృష్ణ గౌడ్, సాంస్కృతిక విభాగం జిల్లా కన్వీనర్ గారపాటి ఆనంద్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement