
మీడియాతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
సాక్షి, కాకినాడ : పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం వాడపల్లి సమీపంలో గోదావరిలో జరిగిన లాంజీ ప్రమాద స్థలిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సందర్శించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొకరికి 10 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించారు. మానవ తప్పిదం వల్లనే ప్రమాదం జరిగిందని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రమాదానికి గురైన బోటును అధికారులు మంగళవారం తనిఖీ చేశారని అన్నారు.
అయిన ప్రకృతి సహకరించలేదని పేర్కొన్నారు. బోటులో మొత్తం 44 మంది ఉన్నారని, అందులో 22 మంది మృతి చెందారని అధికారికంగా ప్రకటించారు. ప్రమాదం నుంచి 22 మంది ప్రాణాలతో బయటపడ్డారని తెలిపారు. చనిపోయిన వారిలో ఇప్పటివరకు 12 మృతదేహాలను వెలికి తీసినట్టు తెలిపారు. మరణించిన మొత్తం 22 మందిలో ఇప్పటి వరకు 19 మంది అధికారికంగా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment