సీఎం సభా.. మజాకా!
* డ్వాక్రా మహిళల్ని తరలించేందుకు స్కూల్ బస్సుల వినియోగం
* ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు
* అత్యుత్సాహం ప్రదర్శించిన అధికారులు
ఏలూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలో నిర్వహించిన సభలను విజయవంతం చేసేందుకు అధికారులు నిబంధనలకు తూట్లు పొడిచారు. మండు వేసవిలో ప్రైవేటు స్కూళ్లలో తరగతులు నిర్వహించడంతో పిల్లలు అవస్థలు పడుతూనే హాజరుకావాల్సి వచ్చింది. అప్పట్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించినా పట్టించుకోని విద్యాశాఖ ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రైవేటు స్కూళ్లకు బుధ, గురువారాల్లో సెలవులు ఇచ్చేసింది. ఇదేదో విద్యార్థులపై మమకారంతో చేసిన పని కాదు. ముఖ్యమంత్రి నిర్వహించిన సభలకు రైతులను, డ్వాక్రా మహిళలను తరలించేందుకు బలవంతంగా స్కూల్, కాలేజీ బస్సులను విద్యాశాఖ తీసుకెళ్లిపోయింది. దీంతో రెండు రోజులపాటు ప్రైవేటు స్కూళ్లు, కళాశాలలు దాదాపుగా మూతపడ్డారుు. దీనివల్ల పిల్లలు రెండు రోజులపాటు పాఠాలకు దూరమయ్యూరంటూ స్కూల్ యూజమాన్యాలు ఆదివారాల్లోనూ తరగతులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.
డ్వాక్రా సదస్సుకు భారీగా వాహనాలు
కొయ్యలగూడెంలో గురువారం నిర్వహించిన డ్వాక్రా మహిళల సదస్సుకు జిల్లా నలుమూలల నుంచి సుమారు 20వేల మంది డ్వాక్రా మహిళలను తరలించారు. ఇందుకోసం జిల్లాలోని ప్రైవేటు విద్యాసంస్థలకు చెందిన 700 బస్సులు, వ్యాన్‌లను వినియోగించారు. విద్యాసంస్థల వాహనాలను సీఎం పర్యటన కోసం పంపించి తీరాలని డీఈవో ఆర్.నరసింహరావు హుకుం జారీ చేయడంతో విద్యాసంస్థల యూజమాన్యాలు కాదనలేకపోయూరు. అప్పటికప్పుడు స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ప్రకటించి ఉదయం 7 గంటలకల్లా ఆ వాహనాలను సమీపంలోని పట్టణాలు, మండల కేంద్రాలకు పంపించారు.
ప్రతి మండలం నుంచి 500 నుంచి వెయి మంది డ్వాక్రా మహిళలు ఆ బస్సుల్లో తరలి వెళ్లారు. ఇలా వెళ్లిన వాహనాల్లో వేటికీ పర్మిట్లు ఇవ్వలేదు. ఏదైనా ప్రమాదం జరిగిఉంటే అందుకు బాధ్యలెవరనే విమర్శలు చెలరేగారుు. ఆర్టీసీ బస్సులను తీసుకుని ఉంటే సదస్సుకు వెళ్లిన డ్వాక్రా మహిళలకు భద్రత ఉండేదని, ఆర్టీసీకి ఆదాయం కూడా లభించేదని పలువురు వ్యాఖ్యానించారు.