వ్యవసాయాభివృద్ధికి కృషిచేయాలి | Chandrababu government, farmers deceptive advertising | Sakshi
Sakshi News home page

వ్యవసాయాభివృద్ధికి కృషిచేయాలి

Published Thu, Jun 11 2015 11:39 PM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM

Chandrababu government, farmers deceptive advertising

 బొబ్బిలి రూరల్ :   చంద్రబాబు ప్రభుత్వం రైతులపై మోసపూరిత ప్రకటనలు మానాలని, ఖరీఫ్‌లో రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు మర్రాపు సూర్యనారాయణ కోరారు. గురువారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఖరీఫ్ ప్రారంభం అయినా ఇంతవరకు ప్రభుత్వం స్టేట్‌లెవెల్ బ్యాంకర్ల సమావేశం ఏర్పాటుచేయలేదని, రాష్ట్ర రుణప్రణాళిక ప్రకటించలేదని, ఖరీఫ్ ఏక్షన్‌ప్లాన్ ప్రకటించలేదని, నాబార్డు సేటస్ పేపరు విడుదల చేయలేదని మండిపడ్డారు.
 
 జిల్లాస్థాయిలో 1,20,000 హెక్టార్లలో లక్ష క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరం కాగా ఏపీసీడ్స్ ద్వారా కేవలం 40శాతం విత్తనాలను మాత్రమే సరఫరా చేస్తున్నారన్నారు. ఇంత వరకు రుణమాఫీ కేవలం రాజకీయ ప్రకటనే అయ్యిందని, ఎవరికీ న్యాయం జరగలేదని, కొత్తరుణాలు రైతులకు పుట్టడంలేదని, ప్రైవేటు అప్పులు 7,8 రూపాయల వడ్డీకి దొరుకుతున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. ప్రభుత్వం నుంచి రైతులకు అందాల్సిన సహాయం,సహకారం అందడంలేదని, వ్యవసాయాన్ని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు నిరుత్సాహ పరుస్తున్నాయని ఆరోపించారు. పొలం పిలుస్తోందంటూ చంద్రబాబు  హడావిడి ప్రకటనలు, కార్యక్రమాలు చేయడం వల్ల రైతులకు ఒరిగిందేమీలేదని, రుణమాఫీ, రాయితీపై విత్తనాలు అందించి రైతులను ఆదుకోవాలని కోరారు.
 
 జిల్లాలో ఏర్పాటుచేసిన మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలలో ఇంతవరకు చెల్లింపులు జరపలేదని,ఎన్‌సీఎస్ యాజమాన్యం చెరుకు బకాయి లుచెల్లించకపోయినా రైతులకు ప్రభుత్వం న్యాయం చేయలేదన్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విత్తనాలను సర్పంచ్‌ల ద్వారా రైతులకు పంపి ణీ చేయాలని తలంపుచేస్తోందని, ఇలా అయితే రాజకీయ కారణాలతో రైతులకు అందే అవకాశం ఉండదని, అలాంటి ఆలోచనలను ప్రభుత్వం మానుకోవా లని లేకుంటే తగిన బుద్ది చెబుతామని హెచ్చరించారు.  కార్యక్రమంలో రైతుసంఘం నాయకులు వి.చిన్నంనాయుడు, గంట సింహాచలం  పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement