గవర్నర్ జోక్యం కోరిన బాబు, కేసీఆర్
హైదరాబాద్: నాగార్జున్ సాగర్ జలాల వివాదం పంచాయతీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ వద్దకు వెళ్లనుంది. వివాదాన్ని పరిష్కరించుకునేందుకు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ గవర్నర్ జోక్యం కోరారు. ఆయన సమక్షంలో సమస్యను పరిష్కరించుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం 10 గంటలకు గవర్నర్ సమక్షంలో భేటీ కావాలని చంద్రబాబు, కేసీఆర్ నిర్ణయించారు.
మరోవైపు జల జగడంపై ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రులు ఒకరిపైఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. కాగా నాగార్జున్ సాగర్ రెండు రాష్ట్రాల పోలీసులు పరస్పరం దాడులకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.