గవర్నర్ దంపతులకు ఘనస్వాగతం | Grand welcome to governor couples | Sakshi
Sakshi News home page

గవర్నర్ దంపతులకు ఘనస్వాగతం

Published Sat, Dec 27 2014 1:04 AM | Last Updated on Fri, Oct 19 2018 7:22 PM

గవర్నర్ దంపతులకు ఘనస్వాగతం - Sakshi

గవర్నర్ దంపతులకు ఘనస్వాగతం

నాగార్జునసాగర్: ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ దంపతులు శుక్రవారం నాగార్జునసాగర్‌ను సందర్శించారు. స్థానిక విజయువిహార్ అతిథిగృహం వద్ద కలెక్టర్ చిరంజీవులు, ఎస్పీ ప్రభాకర్‌రావు, టూరిజం అభివృద్ధి సంస్థ డీవీఎం వెంకటేశ్వర్‌రావులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి ఘనంగా స్వాగ తం పలికారు. గవర్నర్  పోలీసుల గౌర వ వందనాన్ని స్వీకరించారు. విజయవిహార్‌లోకి గవర్నర్ వాహనాలు రాగానే గిరిజన మహిళలు చేసిన సాంప్రదా య నృత్యాలు అలరించాయి.  

మధ్యాహ్నం 3.27 నిముషాలకు విజయువిహార్‌లోకి వచ్చిన ఆయన కొద్దిసేపు విశ్రాం తి తీసుకుని ఐదుగంటలకు సాగర్‌డ్యాం మీదుగా ఎత్తిపోతలకు వెళ్లారు. అక్కడ పర్యాటక అభివృద్ధి సంస్థ సుగాలీలనృత్యాలతో గవర్నర్‌కు ఘనస్వాగతం పలికారు. ఎత్తిపోతలను సందర్శించిన అనంతరం తిరిగి విజయవిహార్‌కు చేరుకున్నారు. వీరికి స్వాగతం పలికిన వారిలో పర్యాటక సంస్థకు చెందిన టూరిజం ఎండి సుమిత్‌సింగ్,ఏజీఎం మనోహర్,వాటర్‌ఫీట్ జీఎం నాగేశ్వర్‌రావు, గైడ్ సత్యనారాయణ ఉన్నారు.
 
పోలీసుల ఆధీనంలో నాగార్జునసాగర్

గవర్నర్ రాకతో సాగర్‌లోని ముఖ్యమైన ప్రదేశాలలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. విజయవిహార్‌లోకి గదులు అద్దెకుతీసుకున్న వారిని తప్ప లోపలికి ఎవరినీ అనుమతించలేదు. గవ ర్నర్ పర్సనల్‌గా సాగర్‌ను సందర్శించడానికి మాత్రమే వచ్చారని విలేకరులను కూడా విజయవిహార్‌లోకి అనుమతించలేదు. పెద్దవూర నుంచి ఎత్తిపోతల వరకు అడుగడుగునా పోలీసుల బందోబస్సు ఏర్పాటు చేశారు. మిర్యాలగూడ, దేవరకొండ డీఎస్పీలతో పాటు ఐదుగురు సీఐలు, 21మంది ఎస్‌ఐలు 180 మంది కానిస్టేబుళ్లు బందోబస్తు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement