
సొంత టీవీ చానల్ దిశగా బాబు ఆలోచన
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ టీవీ చానల్ ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా పార్టీ పరంగా ఈ చానల్‌ను ప్రారంభించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పార్టీ పరంగా చానల్ ఏర్పాటు విషయమై రెండు రోజుల క్రితం చంద్రబాబు చర్చించారు. కొద్ది రోజుల్లో చానల్ ఏర్పాటు అంశంపై స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి.