భయపడొద్దు..మేమున్నాం!
విజయనగరం మున్సిపాలిటీ : జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు పిలుపుని చ్చారు. అధికార పార్టీ నాయకుల బెదిరింపులు, వేధిం పులకు భయపడొద్దని, అండగా మేముం టామని భరోసా ఇచ్చారు. మంగళవారం వైఎ స్సార్ సీపీ విజయనగరం నియోజకవర్గ ఇన్‌చార్జి కోలగట్ల వీరభద్రస్వామి నేతృత్వంలో తన స్వగృహంలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పెను మత్స మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి కార్యకర్తలను సంసిద్ధులను చేయడంలో కోలగట్ల కృషి అభినందనీయమన్నారు. కల్లబొళ్ల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఎన్నికల్లో ప్రకటిం చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు.
రెండు నెలలకే టీడీపీ ప్రభుత్వంపై ప్రజ ల్లో వ్యతిరేకత మొదలైందని చెప్పారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కోలగట్ల వీరభద్రస్వా మి మాట్లాడుతూ జిల్లాలో విజయనగరం ని యోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా నిల బెట్టేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఇందులో భాగంగా నాయకత్వ లక్షణాలపై అవగాహన కల్పించేందుకు ప్రతి నెలా నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. రైతులకు రూ. లక్షన్నర, డ్వాక్రా సం ఘాలకు రూ లక్ష చొప్పున రుణమాఫీ చేసామని సంబరాలు చేసుకుంటూ స్వీట్లు పంచుకుంటున్న టీడీపీ నాయకులు రుణమాఫీ జరిగి నట్టు బ్యాంకర్లతో చెప్పించగలరా అని ప్రశ్నిం చారు. రుణమాఫీపై తమ పార్టీ అధినేత జగన్ మోహన్‌రెడ్డికి అవగాహన లేదని ప్రకటనలు చేస్తున్న టీడీపీ నాయకులపై ఆయన తీవ్ర స్థా యిలో ధ్వజమెత్తారు.
టీడీపీ నాయకులు గద్దెనెక్కిన తరువాత ప్రజల చెవిలో పువ్వులు పెడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఆ పార్టీ విడుదల చేసి మేనిఫే స్టోపై బహిరంగ చర్చకు రావాలంటూ టీడీపీ నాయకులకు సవాల్ విసిరారు. పార్టీ జిల్లా యువజన విభా గం అధ్యక్షుడు అవనాపు విజయ్ మాట్లాడుతూ అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు ఎక్కడికక్కడ బెదిరింపులకు దిగుతున్నారని, వాటిని ఎదురించి పార్టీని బలోపేతం చేయాల న్నారు. అంతకుముందు నియోజకవర్గం పరిధిలో పార్టీ ని మరింత బలపేతం చేసేందుకు అవసరమైన సూచనలు, సలహాలను కార్యకర్తల ప్రసంగాల ద్వారా తెలుసుకున్నారు.
అనంతరం ఈ నెల 8 న మహనేత జయంతి సందర్భంగా నిర్వహిం చిన రక్తదాన శిబిరానికి అధిక సంఖ్యలో రక్తదాతలు తీసుకువచ్చిన కార్యకర్తలకు జ్ఞాపికలను, అలాగే రక్తదానం చేసిన 190 మంది కి సర్టిఫికేట్‌లు అందజేశారు. ఈ సమావేశంలో పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆదాడమోహనరావు, ప్రచార కమిటీ కన్వీనర్ వెంకటరమణ, మున్సిపల్ కౌన్సిలర్లు ఎస్‌వివి రాజేష్, పిలకా దేవి, పార్టీ నాయకులు కాళ్ల గౌరీ శంకర్, ఆశపు.వేణు, మామిడి అప్పలనాయుడు, మజ్జి అప్పారావు, బంగారునాయుడు, పాల్గొన్నారు.