విజయనగరం ఫూల్‌బాగ్ : ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసే వరకూ పోరాటాన్ని కొనసాగిస్తామని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అల మండ ఆనందరావు అన్నారు. బుధవారం సీపీఐ, రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు రుణమాఫీ అమలు చే యాలని, కౌలు రైతులకు గుర్తింపుకార్డులు అందించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకవైపు రుణమాఫీకి కట్టుబడి ఉన్నామని చెబుతూనే.. మరోవైపు షరతులు విధిస్తున్నారన్నారు. రుణమాఫీపై షరతులు విధిస్తూ చంద్రబాబు.. మరోసారి రైతు వ్యతిరేకిగా రుజువు చేసుకున్నారని విమర్శించారు.
సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బుగత సూరిబాబు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన రూ.1.50 లక్షల రుణమాఫీ తక్షణమే అమలు చేయాలని, ఖరీఫ్ రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మాఫీ వర్తించని రైతులకు దేవాదా య, ధర్మాదాయ శాఖల ద్వారా రూ.10వేలు చొప్పున ఆర్థిక సహాయం అందించాలన్నారు. అలాగే కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు, రుణాలు మంజూరు చేయూలన్నారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షురాలు లెంక లక్ష్మి మాట్లాడుతూ పంటల భీమా పథకం, పంట నష్టపరిహారం, కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అం దిస్తున్న వ్యవసాయ సబ్సిడీలు కౌలు రైతులందరికీ వర్తింపజేయూలని డిమాండ్ చేశారు. ధర్నాలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఒమ్మి రమణ, మహిళా సంఘం నాయకులు బి.రమణమ్మ, ఎల్.పుణ్యవతి, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్, తదితరులు పాల్గొన్నారు.
డ్వాక్రా రుణాలు మాఫీ చేయూలి
విజయనగరం ఫూల్‌బాగ్: ప్రభుత్వం డ్వాక్రా రుణాలు మాఫీ చేసేవరకూ పోరాటాన్ని కొనసాగిస్తామని ఐద్వా జిల్లా కార్యదర్శి వంజరాపు లక్ష్మి హెచ్చరించారు. బుధవారం ఆమె పట్టణంలోని లావు బాలగంగాధరరావు భవనంలో ఐద్వా 13వ రాష్ర్ట మహాసభ లకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈసందర్భం గా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి చంద్రబాబు తన నిజాయితీని నిరూపిం చుకోవాలన్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేయకుండా మహిళలను మోసం చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ‘నవ్యాంధ్రప్రదేశ్‌లో మహిళల భద్రత-డ్వాక్రా రుణాల మాఫీకై’ అనే నినాదంతో ఈ నెల 26న చలో విజయవాడ కార్యక్రమం చేపట్టనున్నట్టు తెలిపారు.
అన్ని జి ల్లాల మహిళలతో కలిసి విజయవాడలో భారీప్రదర్శన నిర్వహిస్తామని, అదేరోజు విజయవాడలోని జింఖానా గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ జరుగుతుందన్నారు. అన ంతరం ఐద్వా రాష్ర్ట మహాసభలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ సభలకు ప్రధాన వక్తగా ఐద్వా జాతీయ నాయకురాలు, సీపీ ఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌తోపాటు ఐద్వా జాతీయ అధ్యక్షుడు మాలిని భట్టాచార్య, జాతీయ ఉపాధ్యక్షురాలు సు ధా సుందరరామన్, ఐద్వా రాష్ర్ట కార్యదర్శి కె. స్వరూపారాణి హాజరుకానున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి పి. రమణమ్మ, జిల్లా కమిటీ సభ్యులు జి. కళ్యాణి, ఎస్. మంగమ్మ, తదితరులు పాల్గొన్నారు.
రుణమాఫీ అమలు చేసే వరకూ పోరాటం
Published Thu, Sep 18 2014 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 PM
Advertisement