
అబద్ధాలతో ఎంత కాలం?
గంట్యాడ: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే టీడీపీ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జి ల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి హెచ్చరించారు. పార్టీ కార్యకర్తలు ప్రజా పక్షాన పోరాటం చేయూలని పిలుపునిచ్చారు. టీడీపీ నాయకులు పింఛన్ల తొలగింపులోనూ రాజ కీయం చేస్తున్నారని, ఎక్కడైనా అర్హులకు పిం ఛన్లు అందకపోతే వారి తరు ఫున పోరాటం చే యూలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూ చించారు. ఆదివారం ఆయన మండలంలోని కొటారుబిల్లి జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన వైఎ స్సార్ సీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎ స్సార్ సీపీకి మంచి భవిష్యత్తు ఉందని, కార్యకర్తలు అధైర్య పడకుండా పార్టీ బలోపేతానికి కృషి చేయూలని పిలుపునిచ్చారు.
కార్యకర్తలకు పూర్తిస్థారుులో భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. రుణమాఫీపై ప్రభుత్వం అనుసరి స్తున్న వైఖరిని ప్రజల్లోకి తీసుకువెళ్లి వారి తరుఫున పోరాటం చేయాలన్నారు. బాబు వస్తే జా బు వస్తుందని ప్రచారం చేసిన టీడీపీ నాయకు లు తీరా అధికారంలోకి వచ్చాక రైతులకు వెన్నుముకలా ఉన్న ఆదర్శ రైతులను తొలగిం చడం అన్యాయమన్నారు. ఇదే చంద్రబాబు నైజమని ఎద్దేవాచేశారు. డ్వాక్రా మహిళలు రుణాలు చెల్లించనక్కర్లేదని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పుడు మాట మార్చడం సరికాదన్నా రు. పొలం పిలుస్తోంది, బడి పిలుస్తోంది కార్యక్రమాలు చెప్పుకోవడానికే తప్ప.. వాటి వల్ల ఫలితం లేదన్నారు. నాలుగు నెలల్లో ఏమి చేశారని జన్మభూమి పేరు తో ప్రజల్లోకి వెళ్తున్నా రని ప్రశ్నించారు. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు మాట్లాడుతూ అబద్దాలు చెప్పి అధికారంలోకి వ చ్చిన చంద్రబాబు అవే అబద్దాలతో ప్రజలను మోసగిస్తున్నారన్నారు.
ఇదే రానున్న రోజుల్లో వైఎస్సార్ సీపీ విజయానికి పునాది అని చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ.. ప్రజలకు అండగా ఉందామన్నారు. కార్యకర్తలు నిరాశ చెందకుండా ఉత్సాహంగా ఉండాలని సూచించారు. ఏవైనా విభేదాలు ఉంటే నాయ కులు దృష్టికి తీసుకురావాలని తెలిపారు. పార్టీ గజపతినగరం నియోజకవ ర్గ ఇన్‌చార్జి కడుబండి శ్రీనివాసరావు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు కార్యాలయూన్ని ఏర్పాటు చేశామన్నారు. జామి, గంట్యాడ మం డలాల నుంచి కార్యకర్తలు, ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు గజపతినగరం రాకుం డా ఇక్కడి కార్యాలయూనికి వచ్చి సిబ్బందికి తెలియజేయూలన్నారు.
భవిష్యత్తులో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చూస్తామన్నారు. ఎస్. కోట నియోజకవర్గ ఇన్‌చార్జి నెక్కల నాయుడుబాబు మాట్లాడుతూ కార్యకర్తలు ఉత్సాహంగా ఉండాలని, టీడీపీ ప్రభు త్వానికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ అంబళ్ల శ్రీరాములనాయుడు, పార్టీ నా యకులు వర్రి నర్సింహమూర్తి, ఎం. కృష్ణబా బు, ఎం. సన్యాసినాయుడు, పూడి సత్యనారాయణ, కోడెల ముత్యాలనాయుడు, జాగరపు సత్యారావు, బొబ్బాది నారాయణ, బోనంగి పీఏసీఎస్ అధ్యక్షుడు జె.రమణ, అలమండ సూరిబాబురాజు, కడుబండి రమణ, గుండపు సత్యారా వు, నడిపేన శ్రీను పాల్గొన్నారు.
స్నేహ పూర్వకంగానే కలిశాను
పీరుబండి జైహింద్‌కుమార్‌ను స్నేహ పూర్వకంగానే కలిశానని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఆదివారం ఆయన రామవరంలో తన చిరకాల మిత్రుడు జైహింద్‌కుమార్‌ను కలిసారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజ కీయూలతో సంబంధం లేకుండా, చిరకాల మిత్రుడు కావడంతో కలిసినట్టు తెలిపారు. అనారోగ్యంతో ఉన్న జైహింద్ కుమార్ తండ్రి ని పరామర్శించారు. ఆయనతో పాటు పార్టీ నాయకుడు ఎం. సన్యాసినాయుడు, తదిత రులు ఉన్నారు.