రాజమండ్రి :‘ఓటుకు నోటు పంచడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కొత్తకాదు. సొంత మామకు వెన్నుపోటు పొడిచి పదవి లాక్కునే విషయంలో గతంలో వైశ్రాయ్ హోటల్ కేంద్రంగా బాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. ఈసారి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఆయన తక్షణం పదవికి రాజీనామా చేయాలి’ అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు రాజీనామా చేయాలని, ఆయనను ఏ-1గా గుర్తించి కేసు నమోదు చేయాలన్న డిమాండ్లతో రాజా రాజమండ్రిలో గురువారం ఒక రోజు నిరాహార దీక్ష చేశారు.
ఆయనతోపాటు వైఎస్సార్‌సీపీ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, రాష్ట్ర నాయకులు దంగేటి వీరబాబు, రాయపురెడ్డి చిన్న, పిల్లి నిర్మల, మాసా రామజోగు, మజ్జి నూకరత్నం తదితరులు దీక్షలో పాల్గొన్నారు. పార్టీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయిలు రాజాకు సాయంత్రం నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ ‘ఒక్క ఎమ్మెల్సీ గెలిచినంత మాత్రాన తమకు అధికారం రాదంటున్న చంద్రబాబు..
అతడిని గెలిపించుకునేందుకు రూ.5 కోట్లు ఇవ్వజూశారంటే.. అధికారం వస్తుందంటే ఎన్ని వేల కోట్లయినా ఖర్చు పెట్టేందుకు వెనుకాడరు’ అని విమర్శించారు. టీడీపీలో కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వరకూ దోపిడీ చేస్తున్నారని, పట్టిసీమ, ప్రైవేటు రాజధాని ఒప్పందాలు, పుష్కరాల పేరుతో దోపిడీ జరుగుతోందని దుయబుట్టారు. పుష్కరాలు పూర్తయ్యాక దోచుకున్న ప్రతి రూపాయీ కక్కిస్తామన్నారు. అడ్డంగా దొరికిపోయి కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ చంద్రబాబు, దీనిని రెండు రాష్ట్రాల సమస్యగా చిత్రించడం దారుణమన్నారు.
పలువురి సంఘీభావం
ఈ దీక్షకు పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు సంఘీభావం తెలిపారు. రాజమండ్రి సిటీ, రూరల్, రాజానగరం నియోజకవర్గాలకు చెందిన పార్టీ కార్యకర్తలు, ప్రజలు శిబిరానికి తరలివచ్చారు. దీక్షకు మద్దతు తెలిపినవారిలో మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, పెండెం దొరబాబు, పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్లు ఆకుల వీర్రాజు, కొండేటి చిట్టబాబు, బొంతు రాజేశ్వరరావు, చెల్లుబోయిన వేణు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, మింది నాగేంద్ర, చెల్లుబోయిన శ్రీను, సేవాదళ్ కార్యదర్శి సుంకర చిన్ని, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఇసుకపల్లి శ్రీనివాసరావు, కార్పొరేటర్ బొంతా శ్రీహరి, నాయకులు ఆదిరెడ్డి వాసు, మేడపాటి అనిల్‌రెడ్డి, అడపా శ్రీహరి
పాల్గొన్నారు.
చంద్రబాబు రాజీనామా చేయాలి
Published Fri, Jun 12 2015 1:15 AM | Last Updated on Tue, May 29 2018 11:47 AM
Advertisement
Advertisement