నాలుగు జిల్లాల కోసమే బాబు తపన: లక్ష్మణరెడ్డి
రాయలసీమ అభివృద్ధి సమితి అధ్యక్షుడు జస్టిస్ లక్ష్మణరెడ్డి
బి.కొత్తకోట(చిత్తూరు): అభివృద్ధిని విజయవాడలోనే కేంద్రీకృతం చేస్తున్న ప్రభుత్వ చర్యలు ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో ప్రత్యేక ఉద్యమాలకు ఆజ్యం పోసేలా ఉన్నాయని రాయలసీమ అభివృద్ధి సమితి అధ్యక్షుడు జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి అన్నారు.
చిత్తూరు జిల్లాలోని చెన్నారాయునిపల్లెలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధానిపై ఉత్తరాంధ్ర, సీమ ప్రజలు సంతృప్తిగా లేరన్నారు. కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ మిగతా జిల్లాలను నిర్లక్ష్యం చేస్తున్నారని సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. అభివృద్ధిని వికేంద్రీకరిస్తామన్న ఆయన.. దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.