చీపురుపల్లి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడం చేతకాకపోతే ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు తప్పుకోవాలని సీపీఐ నేత కామేశ్వరరావు అన్నారు. శనివారం విజయనగరం జిల్లా చీపురుపల్లి మండల కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో కేంద్రమంత్రి ఇంద్రజిత్‌సింగ్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా సీపీఐ జిల్లా కార్యదర్శి కామేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబునాయుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురాలేకపోతే వెంటనే పదవి నుంచి తప్పుకోవాలన్నారు. జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు సీపీఐ పోరాటం చేస్తూనే ఉంటుందని ప్రకటించారు.
'చేతకాకపోతే చంద్రబాబు తప్పుకోవాలి'
Published Sat, Aug 1 2015 3:53 PM | Last Updated on Sun, Sep 3 2017 6:35 AM
Advertisement
Advertisement