చంద్రబాబు లేఖ వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి: తోట
ఏలూరు: రాష్ట్ర విభజన చేయాలంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ ఇవ్వడం వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి పట్టింది అని వైఎస్‌ఆర్‌సీపీ నేత తోట చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్, బీజేపీ, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబులను వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన జరిగినా రాజధానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని..విజయవాడ-ఏలూరుల మధ్య రాజధాని ఏర్పాటు చేయాలని తోట చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.
వైఎస్‌ఆర్ జనభేరీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వైఎస్ జగన్ రావడంతో ఏలూరు జనసంద్రమైందని తోట చంద్రశేఖర్ అన్నారు. జనభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్యకర్తలకు, ప్రజలకు తోట చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు.