
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ సచివాలయం మొదటి బ్లాక్‌లో మార్పులు చేపట్టారు. వాస్తుకు అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఛాంబర్‌ను ఆగ్నేయ మూల నుంచి మార్చనున్నారు. ఈ క్రమంలో పాత ఛాంబర్ పక్కన కొత్తగా మరో ఛాంబర్‌ను నిర్మించునున్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి చాంబర్‌లోకి వెళ్లే ఒక ద్వారాన్ని కూడా మూసివేశారు.
కాగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151, 25 పార్లమెంట్ స్థానాలకు గాను 22 స్థానాలు సాధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో సీఎంగా పగ్గాలు చేపట్టిన జగన్ రెండోరోజే సచివాలయంలో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. శుక్ర, శని వారాల్లో ఆయన సచివాలయంలో పరిపాలన వ్యవహారాలు సమీక్షించే అవకాశం ఉంది.