చెవిరెడ్డి మునిరెడ్డి ఆదర్శప్రాయులు
తుమ్మలగుంట(తిరుపతి రూరల్): చెవిరెడ్డి మునిరెడ్డి ఆదర్శప్రాయుడని ప్రముఖులు కొనియాడారు. వైఎస్సార్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తాత మునిరెడ్డి కర్మక్రియలు బుధవారం తుమ్మలగుంటలో నిర్వహించారు. వివిధ పార్టీల నాయకులు మునిరెడ్డికి నివాళులర్పించారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఎమ్మెల్యే స్థాయికి ఎదగడంలో మునిరెడ్డి కృషి ఎంతో ఉందన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
నివాళులర్పించిన ప్రముఖులు..
చెవిరెడ్డి మునిరెడ్డికి నివాళులర్పించిన వారిలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలకమండలి సభ్యులు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు నారాయణస్వామి (జీడీ నెల్లూరు), దేశాయ్ తిప్పారెడ్డి(మదనపల్లి), రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి(కావలి), సుగుణమ్మ(తిరుపతి), కొరుముట్ల శ్రీనివాసులు (రైల్వే కోడూరు), ఐజయ్య(నందికొట్కూరు), ఎమ్మెల్సీ నరేష్‌కుమార్, నాయకులు కశంకర్‌రెడ్డి, భానుప్రకాష్‌రెడ్డి, కోలా ఆనంద్, మిద్దెల హరి, డాక్టర్ సుధారాణి, నవీన్‌కుమార్‌రెడ్డి, దామినేటి కేశవులు, పార్టీ రాష్ట్ర నాయకులు మునీశ్వర్‌రెడ్డి, విక్రంరెడ్డి, లోకనాథరెడ్డి, బాబురెడ్డి పాల్గొన్నారు.