పుష్కరాల ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సాయంత్రం రాజమండ్రి రానున్నారు. ప్రత్యేక విమానంలో రానున్న
సాక్షి, రాజమండ్రి : పుష్కరాల ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సాయంత్రం రాజమండ్రి రానున్నారు. ప్రత్యేక విమానంలో రానున్న సీఎం టూర్ షెడ్యూల్‌ను అధికారులు ఆదివారం రాత్రి విడుదల చేశారు. సాయంత్రం 5 గంటలకు సీఎం ప్రత్యేక విమానంలో మధురపూడి విమానాశ్రయానికి వస్తారు. 5.15 గంటలకు నమూనా ఆలయాలను ప్రారంభిస్తారు. 5.30 గంటలకు పుష్కర్‌ఘాట్‌కు వెళ్లి వెయ్యి మంది కళాకారుల నృత్యప్రదర్శనను వీక్షిస్తారు. 6.15 గంటలకు శాప్ ఆధ్వర్యంలో రాజమండ్రికి చేరుకున్న పుష్కర అఖండ స్వాగత జ్యోతి యాత్ర (టార్చిర్యాలీ)కు స్వాగతం పలుకుతారు. 6.30 గంటలకు గోదావరి అఖండ నిత్యహారతిని వీక్షిస్తారు. 7 గంటలకు పుష్కర్ ఘాట్ నుంచి స్కైలాంతర్లు విడుదల చేస్తారు. 7.30 గంటలకు హావ్‌లాక్ బ్రిడ్జిపై లేజర్ షోను ప్రారంభిస్తారు. అనంతరం ఆర్ట్స్ కళాశాలలో 8.10 గంటలకు డ్వాక్రా బజార్ ప్రారంభిస్తారు. 8.15 గంటలకు పద్మభూషణ్ స్వప్నసుందరి కూచిపూడి నృత్యప్రదర్శన ఉంటుంది.