
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘ఒక్కడు’ సినిమా రిలీజ్ సందర్భంగా హీరో మహేష్‌బాబు కటౌట్‌కు హీరో నాగచైతన్య క్షీరాభిషేకం చేశారు.. అక్కడ ఉన్న అభిమానులంతా మహేష్‌బాబుకు జైకొట్టారు.. ఇది సోమవారం రాజమహేంద్రవరం అశోక థియేటర్ వద్ద జరిగిన హడావుడి. ఇక అసలు విషయానికొస్తే.. దిల్ రాజు నిర్మాతగా, విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య, ప్రియాంక మోహన్ హీరో హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘థ్యాంక్యూ’.
ఆ చిత్రంలో నాగచైతన్య హీరో మహేష్‌బాబు ఫ్యాన్. ‘ఒక్కడు’ సినిమా రిలీజ్ సందర్భంగా మహేష్‌బాబు కటౌట్‌కు క్షీరాభిషేకం చేసే సన్నివేశాన్ని చిత్రీకరించడంతో పాటు థియేటర్‌లో హీరో హీరోయిన్లపై పలు సన్నివేశాలు తీశారు. నాగచైతన్యను చూసేందుకు ఆయన అభిమానులు అధిక సంఖ్యలో తరలి రావడంతో అక్కడ సందడి నెలకొంది.
చదవండి:
నా సంపాదన అంతా ఊడ్చేశారు: రాజేంద్ర ప్రసాద్
దృశ్యం 2: కేసు రీఓపెన్ చేయనున్న రానా!
Comments
Please login to add a commentAdd a comment