Rajahmundry tour
-
మీ బిడ్డగా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నా: సీఎం వైఎస్ జగన్
సాక్షి, తూర్పు గోదావరి: పింఛన్లు పెంచుకుంటూ పోతామన్న హామీని మీ బిడ్డగా నిలబెట్టుకున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. రాజమండ్రిలో పింఛన్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. పింఛన్లు కేవలం వృద్ధులకు మాత్రమే కాదు.. రకరకాల సమస్యలతో బాధపడుతున్న అర్హులైన వాళ్లందరికీ అందుతున్నాయి. ప్రభుత్వం తరపున పేదలకు అందిస్తున్న ఆ పెన్షన్ సాయం దేశంలో ఎక్కడా ఈ స్థాయిలో అందడం లేదని, అది మీ బిడ్డ పరిపాలనలోనే జరుగుతోందని సీఎం జగన్ సగర్వంగా ప్రకటించుకున్నారు. కొత్తగా మరికొందరికి పింఛన్లు జాబితాలో చేర్చామని, అందుకోసం నిధులను సైతం ప్రభుత్వం విడుదల చేసిందని గుర్తు చేశారు. కొత్తగా బియ్యం కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు వలంటీర్లు ఇంటికి వెళ్లి మరీ అందిస్తున్నారని ఆయన ప్రకటించారు. పింఛన్లు రూ. 2,500 నుంచి రూ.2,750కి పెంచాం. ఖర్చుకు వెనకాడకుండా లబ్ధిదారుల సంక్షేమం కోసం పాడుపడుతున్నాం. గత ప్రభుత్వంలో కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ అందేది.. మేం అధికారంలోకి వచ్చాక ఆ సంఖ్య పెరిగింది. ఇప్పుడు ఏకంగా 64 లక్షల మందికి పెన్షన్ అందిస్తున్నాం. గత ప్రభుత్వంలో పెన్షన్ల కోసం చేసిన ఖర్చు కేవలం రూ.400 కోట్లు. ఈ ప్రభుత్వంలో పెన్షన్లకే రూ.1,765 కోట్లు ఇస్తున్నాం. దేశంలో రూ. 2,750 నుంచి పదివేల రూపాయల దాకా పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే. గత ప్రభుత్వంలో పింఛన్లు కావాలంటే.. జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. లంచాలు చెల్లించాల్సిన పరిస్థితి. కానీ, ఇప్పుడు గత ప్రభుత్వంలో మాదిరి పింఛన్ల విషయంలో వివక్ష లేదు, అవినీతికి తావు లేదు, కత్తిరింపులు లేవు, ఎగ్గొట్టడాలు లేవు. ఇప్పుడు.. ఎక్కడా ఎలాంటి తారతమ్యాలు లేకుండా కేవలం అర్హత అనే దాని ప్రామాణికంగా పింఛన్ అందిస్తున్న వ్యవస్థ మీ బిడ్డ హయాంలో జరుగుతోంది. ఇది మనసున్న పరిపాలన. చెడు చేసిన వాళ్లకు సైతం మంచి చేయాలనే తపనే తప్ప మరొక ఉద్దేశ్యమే కనిపించదని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడాలను గమనించాలని లబ్ధిదారులను ఉద్దేశించి సీఎం వైఎస్ జగన్ పిలుపు ఇచ్చారు. -
రాజమండ్రిలో పర్యటించిన బొత్స
సాక్షి, తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం రాజమండ్రిలో పర్యటించారు. ఈ క్రమంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు విశ్వరూప్, కన్నబాబు, వేణు, ఎంపీ భరత్ తదితరులు హాజరయ్యారు. చదవండి: ఇసుక కొరత లేకుండా చర్యలు: మంత్రి బొత్స -
మహేష్‌బాబుకు జైకొట్టిన నాగచైతన్య
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘ఒక్కడు’ సినిమా రిలీజ్ సందర్భంగా హీరో మహేష్‌బాబు కటౌట్‌కు హీరో నాగచైతన్య క్షీరాభిషేకం చేశారు.. అక్కడ ఉన్న అభిమానులంతా మహేష్‌బాబుకు జైకొట్టారు.. ఇది సోమవారం రాజమహేంద్రవరం అశోక థియేటర్ వద్ద జరిగిన హడావుడి. ఇక అసలు విషయానికొస్తే.. దిల్ రాజు నిర్మాతగా, విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య, ప్రియాంక మోహన్ హీరో హీరోయిన్గా నటిస్తున్న చిత్రం ‘థ్యాంక్యూ’. ఆ చిత్రంలో నాగచైతన్య హీరో మహేష్‌బాబు ఫ్యాన్. ‘ఒక్కడు’ సినిమా రిలీజ్ సందర్భంగా మహేష్‌బాబు కటౌట్‌కు క్షీరాభిషేకం చేసే సన్నివేశాన్ని చిత్రీకరించడంతో పాటు థియేటర్లో హీరో హీరోయిన్లపై పలు సన్నివేశాలు తీశారు. నాగచైతన్యను చూసేందుకు ఆయన అభిమానులు అధిక సంఖ్యలో తరలి రావడంతో అక్కడ సందడి నెలకొంది. చదవండి: నా సంపాదన అంతా ఊడ్చేశారు: రాజేంద్ర ప్రసాద్ దృశ్యం 2: కేసు రీఓపెన్ చేయనున్న రానా! -
నేడు సీఎం రాక
సాక్షి, రాజమండ్రి : పుష్కరాల ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సాయంత్రం రాజమండ్రి రానున్నారు. ప్రత్యేక విమానంలో రానున్న సీఎం టూర్ షెడ్యూల్‌ను అధికారులు ఆదివారం రాత్రి విడుదల చేశారు. సాయంత్రం 5 గంటలకు సీఎం ప్రత్యేక విమానంలో మధురపూడి విమానాశ్రయానికి వస్తారు. 5.15 గంటలకు నమూనా ఆలయాలను ప్రారంభిస్తారు. 5.30 గంటలకు పుష్కర్‌ఘాట్‌కు వెళ్లి వెయ్యి మంది కళాకారుల నృత్యప్రదర్శనను వీక్షిస్తారు. 6.15 గంటలకు శాప్ ఆధ్వర్యంలో రాజమండ్రికి చేరుకున్న పుష్కర అఖండ స్వాగత జ్యోతి యాత్ర (టార్చిర్యాలీ)కు స్వాగతం పలుకుతారు. 6.30 గంటలకు గోదావరి అఖండ నిత్యహారతిని వీక్షిస్తారు. 7 గంటలకు పుష్కర్ ఘాట్ నుంచి స్కైలాంతర్లు విడుదల చేస్తారు. 7.30 గంటలకు హావ్లాక్ బ్రిడ్జిపై లేజర్ షోను ప్రారంభిస్తారు. అనంతరం ఆర్ట్స్ కళాశాలలో 8.10 గంటలకు డ్వాక్రా బజార్ ప్రారంభిస్తారు. 8.15 గంటలకు పద్మభూషణ్ స్వప్నసుందరి కూచిపూడి నృత్యప్రదర్శన ఉంటుంది. -
జిల్లాలో ముగిసిన సీఎం పర్యటన
సాక్షి, రాజమండ్రి : జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పర్యటన ఆదివారంతో ముగిసింది. ఉదయం 10.35 గంటలకు మధురపూడిలోని రాజమండ్రి విమానాశ్రయం నుంచి జెట్ ఎయిర్వేస్ విమానంలో ఆయన హైదరాబాద్ వెళ్లారు. రాజమండ్రిలో శనివారం జరిగిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రాత్రి అమలాపురం ఎంపీ జి.వి.హర్షకుమార్ కుమారుల వివాహానికి హాజరయ్యారు. అనంతరం ఆర్ అండ్ బీ అతిథి గృహంలో బస చేశారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి ఆయన స్థానిక నేతలను కలుసుకున్నారు. అతిథిగృహ సమావేశ మందిరంలో వివిధ సంఘాల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కానరాని కార్యకర్తలు ముఖ్యమంత్రి తమ ఊరు వస్తారంటే క్యాడర్లో ఉత్సాహం ఉరకలు వేస్తుంది. కానీ కిరణ్ కుమార్ రెడ్డి బస వద్ద అటువంటి ఛాయలు కనిపించలేదు. స్వాగత సత్కారాల నుంచి వీడ్కోలు వరకూ ఎక్కడా పార్టీ జెండాలు కనిపించలేదు. రచ్చబండలో తమ వర్గాల వారికి అన్యాయం జరుగుతోందని, అనుయాయులకు రేషన్ కార్డులు, పింఛన్లు దక్కడం లేదన్న అసంతృప్తితో డివిజన్లలో క్యాడర్ సీఎం పర్యటనలో పాల్గొనలేదని నేతలే చెప్పారు. దీనికి తోడు ఎమ్మెల్యే రౌతు, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం వర్గాలకు మధ్యన ఉన్న విబేధాలు సీఎం పర్యటనలో కొట్టొచ్చినట్టు కనిపించాయి. ఏసీవై రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన సీఎం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నేత ఏసీవై రెడ్డి కుటుంబాన్ని ముఖ్య మంత్రి పరామర్శించారు. 10.00 గంటలకు ఆర్ట్ కళాశాల ఎదురు వీధిలో ఉన్న ఏసీవై ఇంటికి చేరుకుని ఆయన కుటుంబాన్ని ఓదార్చారు. మంత్రులు కాసు వెంకట కృష్ణారెడ్డి, పితాని సత్యనారాయణ, పినిపే విశ్వరూప్, పలువురు ఎమ్మెల్యేలు ఆయన వెంట ఉన్నారు. వినతులందించేందుకు క్యూ ముఖ్యమంత్రికి తమ తమ విజ్ఞాపనలు అందించేందుకు ఉద్యోగ, ప్రజా సంఘాల వారు బారులు తీరారు. సమావేశ మందిరంలో సీంఎ వారందరి నుంచీ కాగితాలు తీసుకుని రాజమండ్రి ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, పిఠాపురం ఎమ్మెల్యే వంగా గీతలకు అందచేశారు. బీసీలకు సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ముఖ్య మంత్రిని కోరుతూ వినతి పత్రం అందజేసింది. తల్లిదండ్రులు, వయో వృద్ధుల పోషణ చట్టం ఆమలులోకి తెచ్చేందుకు కృషి చేయాలని ఆ సంఘం ప్రతినిధులు కోరారు. హెల్త్ కార్డుల కోసం ఐక్య ఉపాధ్యాయ కార్యాచరణ సమితి వినతి ఇచ్చింది. రాజమండ్రిలోని అల్లు రామలింగయ్య హోమియోపతి కళాశాలలో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు ప్రారంభించాలని విద్యార్థులు కోరారు. ఏబీసీడీ విభజనకు అనుకూలంగా చర్యలు చేపట్టాలని ఎమ్మార్పీఎస్ ప్రతినిధులు ముఖ్యమంత్రిని కోరారు. ట్రెజరీ ద్వారా జీతాలివ్వాలి కోటగుమ్మం : జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగులకు ఓఐఓ పద్దు ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గట్టి రామారావు ఆధ్వర్యంలో సంఘ నాయకులు కోరారు. జీతాలు, పెన్షన్లు ఓఐఓ పద్దుద్వారా చెల్లించాలని వినతిపత్రం సమర్పించారు. సంఘం గౌరవ అధ్యక్షుడు మారిశెట్టి సత్యనారాయణ, సంఘం సంయుక్త కార్యదర్శి నల్లమిలి రామ కోటేశ్వరరావు, కె సత్యనారాయణ ఆయన వెంట ఉన్నారు. ఇంకా సఘాయి వాలాలు, ఛాంబర్ ఆఫ్‌కామర్స్, నూర్బాష్ ముస్లిం మైనారిటీ సంఘం, అల్యూమినియం అసోసియేషన్, బొమ్మూరు డైట్ కళాశాల, యూటీఎఫ్, రాజమండ్రి నాయీ బ్రాహ్మణ సంఘం, రాజమండ్రి కార్పొరేషన్ రచ్చబండ కమిటీ, ఏపీఎన్జీఓ తదితర సంఘాల ప్రతినిధులుసీఎంను కలిసిన వారిలో ఉన్నారు. మంత్రులు పితాని సత్యనారాయణ, తోట నరసింహం, కాసు కృష్ణారెడ్డి, ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, ఎమ్మెల్సీ చైతన్య రాజు, ఎమ్మెల్యే శేషారెడ్డి, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం తదితరులు సీఎం వెంట ఉన్నారు.