సీఎంకు వైఎస్సార్‌సీపీ నేతల వినతి
కదిరి టౌన్ : అనంతపురంలో రాజధాని ఏర్పాటు చేయాలని వైఎస్సార్‌సీపీ నేతలు సీఎం చంద్రబాబునాయుడుకు విజ్ఞప్తి చేశారు. ఉరవకొండ, కదిరి ఎమ్మెల్యేలు వై.విశ్వేశ్వరరెడ్డి, అత్తార్ చాంద్‌బాష, పార్టీ నేతలు ఆర్‌అండ్‌బీ బంగ్లా వద్ద సీఎంకు విన తిపత్రం అందజేశారు.
వినతిపత్రంలోని అంశాలు....
శ్రీబాగ్ ఒప్పందం మేరకు రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలి
రూ.1,500 కోట్లతో కుద్రేముఖ్ కంపెనీ తలపెట్టిన స్టీల్ ప్లాంట్‌ను వెంటనే ఏర్పాటు చేయాలి
షరతులు లేకుండా రైతు రుణాలు మాఫీ చేసి కొత్త రుణాల మంజూరు, బీమా సౌకర్యం కల్పించాలి
2013-14 పెండింగ్‌లో ఉన్న పంట నష్ట పరిహారం, వాతావరణ బీమా తక్షణమే చెల్లించాలి
చేనేతలకు సబ్సిడీపై ముడి సరుకు, మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి
జిల్లాలో గార్మెంట్స్, టైక్స్‌టైల్స్ పార్కులను ఏర్పాటు చేయాలి
పుట్టపర్తి విమానాశ్రయాన్ని అంతర్జాతీయంగా అభివృద్ధి చేయాలి
‘ప్రాజెక్టు అనంత’కు కేంద్రం నుంచి విరివిగా నిధులు రాబట్టాలి
బడ్జెట్‌లో నిధులు కేటాయించి హంద్రీ నీవా రెండో దశ పనులను పూర్తి చేయాలి
జిల్లా కేంద్రంలో ఎయిమ్స్, ట్రి పుల్ ఐటీ, ఇండియన్ సర్వీసెస్ సెంటర్, సెంట్రల్ యూనివర్సిటీ నెలకొల్పాలి
హిందూపురం ప్రాంతంలో ఐటీ హబ్ ఏర్పాటు చేయాలి
సోలార్, విండ్ పవర్ ఏర్పాటుతో రైతులకు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రోత్సహకాలు విరివిగా ఇవ్వాలి
హంద్రీ నీవా, పీఏబీఆర్ ప్రాజెక్టులకు నికర జలాలు కేటాయించాలి
రెడ్డిపల్లి వ్యవసాయ పరిశోధనా కేంద్రాన్ని వ్యవసాయ యూనివర్సిటీగా మార్చాలి
విరివిగా పరిశ్రమలు నెలకొల్పి, ట్యాక్స్ హాలిడేతోపాటు సబ్సిడీలు ఇవ్వాలి
‘అనంత’ను పట్టించుకోండి
Published Sat, Jul 26 2014 2:23 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM
Advertisement
Advertisement