
'ఆపదలో ఉన్నవారికి ధైర్యం చెప్పేందుకే నా పర్యటన'
విశాఖ : కేంద్రమంత్రి చిరంజీవి సోమవారం విశాఖ చేరుకున్నారు. జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో ఆయన నేడు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఆపదలో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పేందుకే తన పర్యటన అని అన్నారు. వరద ప్రాంతాల్లో పర్యటించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ఆయన తెలిపారు. బాధితుల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుంటాయని చిరంజీవి హామీ ఇచ్చారు.
వారం రోజుల పాటు కురుస్తున్న భారీ వర్షాలకు పంటలకు భారీ నష్టం వాటిల్లింది. వ్యవసాయ పంటలు 53947.5 ఎకరాల్లోను, ఉద్యానవన పంటలు 1787.5 ఎకరాల్లోను నీట మునిగాయి. జిల్లాలో 229 కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ రోడ్లు పాడయ్యాయి. వీటిని శాశ్వత ప్రాతిపదికన నిర్మించాలంటే రూ.55.46 కోట్లు అవసరమని ఆ శాఖ అధికారులు అంచనా వేస్తున్నా రు. అలాగే పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి 179 కిలోమీటర్ల పరిధిలో 75 రోడ్లు, 11 భవనాలు దెబ్బతినడంతో రూ.1.77 కోట్లు నష్టం ఏర్పడింది.