
వరద బాధితులను పరామర్శించని చిరంజీవి
యలమంచిలి: ఆపదలో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పేందుకే తన పర్యటన అని చెప్పిన కేంద్ర మంత్రి చిరంజీవి వరద బాధితులను పరామర్శించకుండానే వెళ్లిపోయారు. ఈ ఉదయం చిరంజీవి విశాఖపట్నం జిల్లా యలమంచిలి మీదగా వెళ్లారు. ఇక్కడ వరదకు గురైన ప్రాంతాలను చూడలేదు. బాధితులనూ పలకరించలేదు.
కేంద్ర మంత్రి చిరంజీవి యలమంచిలి వస్తున్నట్లు చెప్పడంతో బాధితులు ఆయన కోసం ఎదురు చూశారు. దాదాపు మూడు గంటలపాటు వరద బాధితులు ఆయన కోసం వేచి ఉన్నారు. కానీ ఆయన యలమంచిలి పట్టణంలోకి రాకుండా, బైపాస్ రోడ్డున వెళ్లిపోయారు. దాంతో స్థానిక వరద బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. కష్టాలు పడుతున్న తమను పట్టించుకోవడంలేదని వాపోయారు.