
పామర్రు టీడీపీలో విభేదాలు...
►ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనపై తిరుగుబావుట..
ఉయ్యూరు : కృష్ణాజిల్లా పామర్రులో టీడీపీలో విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన వైఖరిని నిరసిస్తూ మొవ్వ మండలంలో తెలుగు తమ్ముళ్లు తిరుగుబావుట ఎగురవేశారు. ఉప్పులేటి కల్పన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఎంపీపీ మంగమ్మ, వైస్ ఎంపీపీ నన్నపనేని వీరేంద్ర సహా ఏడుగురు ఎంపీటీసీలు, నలుగురు సర్పంచ్‌లు, మరో నలుగురు ఏఎంసీ డైరెక్టర్లు తమ పదవులకు రాజీనామా చేశారు.
ఉప్పులేటి కల్పనకు వ్యతిరేకంగా బుధవారం మొవ్వలో సమావేశమయ్యారు.ఎమ్మెల్యే కల్పన వివక్ష చూపుతున్నారంటూ వారు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఉప్పులేటి కల్పన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి అనంతరం పార్టీ ఫిరాయించిన విషయం తెలిసిందే.