వ్యవసాయ వర్సిటీ ఏర్పాటు చేయండి
- తిరుపతి వాసుల డిమాండ్
- ఇక్కడ వర్సిటీ లేకుంటే నష్టపోతామంటున్న రైతులు, శాస్త్రవేత్తలు
యూనివర్సిటీక్యాంపస్: రాయలసీమ కరువు ప్రాంతం. ఇక్కడి పంటలు, నేల స్వభావం, వ్యవసాయ పద్ధతులు, దిగుబడులు, వ్యవసా య విధానం కోస్తాంధ్రతో పోల్చితే విభిన్నం గా ఉంటుది. ఈ నేపథ్యంలో రాయలసీమ నాలుగు జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల తో కలిపి తిరుపతిలో ప్రత్యేక వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని రాయలసీ మ ప్రాంత ఐక్యకార్యాచరణ సమితి చాలా కాలంగా ఉద్యమిస్తోంది.
ప్రభుత్వం మాత్రం గుంటూరు-విజయవాడ మధ్య వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. దీన్ని తిరుపతికి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతులు వ్యతిరేకిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఆచార్య ఎన్ జీ. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రాష్ర్ట విభజన నేపథ్యంలో తెలంగాణకు వెళ్లింది. సుమారు రూ.60 వేల కోట్ల విలువైన భూము లు, భవనాలు, ఆధునిక వ్యవసాయ పరిశోధన స్థానం తెలంగాణకు పరిమితం కావడంతో సీమాంధ్ర ప్రాంతం తీవ్రంగా నష్టపోయింది.
ఈ నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో వేరొక వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
గతంలో మూడు చోట్ల..
రాష్ట్ర విభజనకు ముందు 2004 వరకు ఉద్యానవన, పశుసంవర్థక, వ్యవసాయ విభాగాల న్నీ ఒకే విశ్వవిద్యాలయంగా హైదరాబాద్ కేం ద్రంగా ఉన్నాయి. 2005లో తిరుపతిలో శ్రీవెం కటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీని, 2009లో తాడేపల్లి గూడెం సమీపంలోని వెంకట్రామన్న గూడెంలో ఉద్యానవన యూనివర్సిటీని ఏర్పా టు చేశారు. రాష్ట్రం విడిపోతున్న దశలో ఉద్యానవన, పశుసంవర్థక, వ్యవసాయ విభాగాన్ని కలిపి మూడు చోట్లా ప్రాంతీయ వ్యవసాయ విశ్వవిద్యాలయాలుగా ఏర్పాటు చేయాలన్న ప్రయత్నం జరిగింది.
అయితే ఇది కార్యరూపం దాల్చలేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు తిరుపతిలోని వెటర్నరీ, వెంకట్రామన్న గూడెంలోని హార్టికల్చరల్ మిగిలాయి. ఈ నేపథ్యంలో రెండు ప్రాంతాలకు చెరొక ప్రాంతీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని తిరుపతికి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు కోరుతున్నారు.
తిరుపతి అన్ని విధాలా అనుకూలం
వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చే యడానికి తిరుపతి అన్ని విధాలా అనుకూలం. తిరుపతి ఎస్వీ వ్యవసాయ కళాశాలతో పాటు ప్రాంతీయ పరిశోధనాస్థానం ఉన్నాయి. కళాశాల ప్రాంగణంలో పరిశోధకులకు, పంటలు సాగుచేయడానికి పొలాలు ఉన్నాయి. చీని, నిమ్మ పరిశోధనా స్థానాలు ఉన్నాయి. కాబట్టి రాయలసీమ ప్రాంతానికి సంబంధించి తిరుపతిలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి.
- టి.ఆదికేశవులు రెడ్డి, వైఎస్సార్ సీపీ, రైతు విభాగం జిల్లా కన్వీనర్
మూడు విశ్వవిద్యాలయాలను కలపాలి
వ్యవసాయ, పశువైద్య, ఉద్యానవన పంటలకు సంబంధించిన విశ్వవిద్యాలయాలను ఒకే గూటికి తెచ్చి తిరుపతిలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి. కోస్తాంధ్రతో పోల్చితే రాయలసీమలో పంటల సరళి, వాతావరణం, నేల స్థితి వేరుగా వుంటాయి. అందువల్ల ఇక్కడ ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తే ఇక్కడి అవసరాలకు అనుగుణంగా ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చు.
- డాక్టర్ ఎ.రామకృష్ణారావు, ప్రధాన కార్యదర్శి, రాయలసీమప్రాంత ఐక్య కార్యాచరణ సమితి