University of Agriculture
-
పత్తికి గరిష్ట ధర రూ.7,200
సాక్షి, హైదరాబాద్: వరి, పత్తి, కంది, మొక్కజొన్న, సోయాచిక్కుడు వంటి పంట ఉత్పత్తులకు మార్కెట్లో అధిక ధరలు లభిస్తాయి. ఈ విషయాన్ని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది. శాస్త్రీయ పద్ధతుల్లో విశ్లేషణ చేసి ఈ ధరలను రూపొందించింది. 22 ఏళ్లుగా రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లలో నెలవారీగా ఉన్న 21 రకాల పంట దిగుబడుల ధరలను నమూనాగా తీసుకొని వాటి ఆధారంగా ధరల అంచనాలను సిద్ధం చేసింది. వాటి ఆధారంగా ఏఏ పంటలు వేస్తే ఏ మేరకు దిగుబడులు వస్తాయో, వాటి ఆదాయంపై రైతులకు అవగాహన పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ మేరకు కసరత్తు చేసినట్టు చెబుతున్నారు. » ఈ సీజన్లో పత్తి దిగుబడి వచ్చే నవంబర్–ఫిబ్రవరి మధ్య గరిష్టంగా క్వింటాకు రూ.7,200 వరకు ధర వస్తుందని వ్యవసాయ వర్సిటీ ప్రకటించింది. కనిష్టంగా రూ. 6,600 ఉంటుంది. » వరి సాధారణ రకానికి నవంబర్–డిసెంబర్ మధ్య కాలంలో రూ. 2,203 నుంచి రూ. 2,350 ధర పలుకుతుంది. ఇక వరి గ్రేడ్ ఏ రకానికి అదే కాలంలో రూ. 2,290 నుంచి రూ. 2,680 వరకు ధర పలుకుతుందని పేర్కొంది. » మొక్కజొన్నకు అక్టోబర్–నవంబర్ మధ్యకాలంలో రూ. 2,150 నుంచి రూ. 2,350 వరకు ధర వస్తుంది. » పంట రకం, నాణ్యత, అంతర్జాతీయ ధర లు, ఎగుమతులు, దిగుమతులు పరిమితు ల మూలంగా ధరల్లో మార్పులు ఉండొచ్చు. ధరను బట్టి పంటలు వేసుకోవచ్చని వర్సిటీ సూచించింది. -
‘ఫిబ్రవరి 14న సిస్టర్స్ డే’
లాహోర్: ఫిబ్రవరి 14 అనగానే అందరికీ గుర్తొచ్చేది వాలెంటైన్స్ డే. అలాంటిది వాలెంట్న్స్ డే నిర్వహించడాన్ని పాకిస్తాన్‌కు చెందిన ఓ యూనివర్సిటీ తప్పుపట్టింది. ఆ రోజున వాలెంటైన్స్ డే కు బదులు సిస్టర్స్ డే జరపాలనే నిర్ణయం తీసుకుంది. ఫైసలాబాద్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైఎస్ చాన్సలర్ జాఫర్ ఇక్బాల్ రణ్‌ధవా తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇతర బోర్డు సభ్యులు కూడా ఆమోదించారు. పాక్ సంస్కృతితోపాటు, ఇస్లాం సంప్రదాయాన్ని పెంపొందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు జాఫర్ తెలిపారు. సిస్టర్స్ డేలో భాగంగా ఫిబ్రవరి 14న మహిళలకు స్వార్ఫ్లు, దుస్తులు బహుమతిగా ఇవ్వాలని అన్నారు. దీనిపై జాఫర్ మాట్లాడుతూ.. ‘సిస్టర్ డే నిర్ణయం విజయవంతం అవుతుందో కాదో తెలియదు. ముస్లింలకు వాలెంటైన్స్ డే వల్ల ప్రమాదం పొంచి ఉంది. కానీ ఈ ముప్పును కూడా అవకాశంగా మలచుకోవాలి. మహిళల పట్ల మాకు చాలా గౌరవం ఉంది. మహిళ సాధికారతను మరచిపోకూడదు. సోదర సోదరిమణుల బంధం కంటే ప్రేమ గొప్పదా?. పాశ్చాత్య సంస్కృతి వెంట పరుగెత్తకుండా జాగ్రత్త వహించాల’ని అన్నారు. కాగా, వాలెంటైన్స్ డే వేడుకలను జరపడంపై పాక్‌లో చాలా కాలంగా వివాదం కొనసాగుతుంది. మెజారిటీ ప్రజలు ఇందుకు వ్యతిరేకంగా నిరసన చేపడుతున్నారు. 2017, 2018లలో వాలెంటైన్స్ డే జరపడాన్ని ఇస్లామాబాద్ హైకోర్టు నిషేధించింది. అలాగే అందుకు సంబంధించి ఎలాంటి వార్తలను ప్రచురించకూడదని ప్రింట్, ఎలక్ర్టిక్ మీడియాకు ఆదేశాలు జారీ చేసింది. -
కేసీఆర్ నిరంకుశ ధోరణి వీడాలి
సాక్షి నెట్వర్క్: పీఆర్సీ అమలు కోసం వర్సిటీల బోధనేతర ఉద్యోగులు, సిబ్బంది కదం తొక్కారు. తమ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన బంద్‌తో ఆయా వర్సిటీలు బోసిపోయాయి. వర్సిటీల ప్రవేశ ద్వారాలు, పరిపాలన భవనాల ముందు ఉద్యోగులు, సిబ్బంది బైఠాయించి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినదించారు. పీఆర్సీ అమలు చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగుల పట్ల కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశ ధోరణి వీడాలని డిమాండ్ చేశారు. జేఎన్టీయూహెచ్ ఇంజనీరింగ్ కళాశాల పరిపాలన విభాగం, యూజీసీ అకడమిక్ స్టాఫ్ కళాశాలలతో పాటు క్యాంపస్‌లోని బ్యాంకులు, క్యాంటీన్‌తో సహా అన్నింటినీ ఉద్యోగులు మూసివేయించారు. గురువారం జరగాల్సిన పరీక్షలను బంద్ కారణంగా అధికారులు వాయిదా వేశారు. ఉద్యోగులు క్యాంపస్ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి.. వాహనాలను, విద్యార్థులను, ఉద్యోగులను క్యాంపస్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, పోలీసు ల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. వీరి ఆందోళనకు పలు విద్యార్థి సంఘాలు మద్దతు పలికాయి. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్రనాయకుడు రాజశేఖర్ ఆధ్వర్యంలో విద్యార్థులు బోధనేతర సిబ్బంది సంఘానికి మద్దతుగా బంద్‌లో పాల్గొన్నారు. అగ్రికల్చర్ వర్సిటీలో... రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయవర్సిటీల బోధనేతర సిబ్బంది కూడా బంద్ పాటించారు. వర్సిటీలోని అన్ని విభాగాలను మూసివేయించి ర్యాలీలు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ మొండి వైఖరి వల్ల సొంత రాష్ట్రంలోనూ ఉద్యమాలు చేసే గతి పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. 10వ పీఆర్సీ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. -
25న డాక్టర్ పి.జి. కృష్ణ స్మారకోపన్యాసం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని డెరైక్టరేట్ ఆఫ్ ఆయిల్‌సీడ్స్ రీసెర్చ్‌లో మంగళవారం ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ పి.జి. కృష్ణ స్మారకోపన్యాసం జరుగనుందని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం తెలిపింది. వ్యవసాయాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన శాస్త్రవేత్త డాక్టర్ పి.జి. కృష్ణ స్మారకార్థం నిర్వహిస్తున్న ఈ సదస్సులో ఢిల్లీకి చెందిన నేషనల్ రెయిన్‌ఫెడ్ అథారిటీ సీఈవో డాక్టర్ జె.ఎస్. శర్మ కీలకోపన్యాసం చేస్తారని శనివారం వర్సిటీ ఈ మేరకు ఒక ప్రకటనలో పేర్కొంది. రేపటి నుంచి ఇండియన్ సొసైటీ ఆఫ్ సోషల్ సెన్సైస్ సదస్సు ఇండియన్ సొసైటీ ఆఫ్ సోషల్ సెన్సైస్ 79వ వార్షిక సదస్సు సోమవారం నుంచి జరుగనుందని హైదరాబాద్ చాప్టర్ ఇండియన్ సొసైటీ ఆఫ్ సాయిల్ సైన్స్ అధ్యక్షులు డాక్టర్ పి.చంద్రశేఖర్‌రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సును వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య ప్రారంభిస్తారు. నాలుగు రోజులు జరిగే ఈ సదస్సుకు 500 మంది హాజరు కానున్నారు. -
డీన్ నియామకంపై రగడ
బాపట్ల టౌన్: ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే వ్యవసాయ కళాశాల ప్రస్తుతం ఆందోళనలతో దద్దరిల్లిపోతోంది. వ్యవసాయ శాఖ మంత్రి, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు అసోసియేట్ డీన్ నియామకంపై తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో విద్యార్థులు రెండో రోజు శనివారం తరగతులు వదిలి.. ప్లకార్డులు చేతబూని రోడ్డెక్కారు. వివరాలిలా ఉన్నాయి.. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిబంధనల ప్రకారం వ్యవసాయ కళాశాలలో అసోసియేట్ డీన్‌గా బాధ్యతలు చేపట్టాలంటే కనీసం మారుమూల ప్రాంతాల్లో రెండు సంవత్సరాలు, కళాశాలలో ప్రొఫెసర్‌గా ఐదేళ్లు పనిచేసి ఉండాలి. డీన్ అయ్యేనాటికి 15 ఏళ్ల సర్వీస్ ఉండాలి. ప్రస్తుతం అసోసియేట్ డీన్‌గా కొనసాగుతున్న డాక్టర్ దర్శి విష్ణుశంకరరావు ఆ మే రకు అర్హతలు ఉన్నాయి. అలా అర్హతలు లేని పీఆర్కే ప్రసా ద్‌ను అసోసియేట్ డీన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్త ర్వులు జారీచేయడంతో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. చట్టవ్యతిరేక నిర్ణయాలను ఉపసంహరించుకోవాలి.. నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటున్న వ్యవసాయశాఖ మంత్రి, విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు వాటిని ఉపసంహరించుకుని కళాశాల ప్రగతికి తోడ్పడాలని వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్లు సూచించారు. విష్ణుశంకరరావుకు మద్దతుగా శనివారం ప్రొఫెసర్లు కళాశాల ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సీనియర్టీలో ఐదో స్థానంలో ఉండి, వివిధ ప్రాంతాల్లో పనిచేసిన అనుభవం కూడా లేని వ్యక్తిని డీన్‌గా నియమించడం కేవలం రాజకీయ కారణమేనని విమర్శించారు. ఇలాంటి నిర్ణయాలు వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. నాన్ టీచింగ్, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి కళాశాల ముందు ఆందోళనకు దిగారు. విద్యార్థుల ర్యాలీ, మానవహారం.. అసోసియేట్ డీన్‌ను మార్పుచేయడం సరికాదంటూ వ్యవసాయ కళాశాల విద్యార్థులు పురవీధుల్లో నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా వెళ్లి స్థానిక పాతబస్టాండ్ సెంటర్లో విద్యార్థులు మానవహారం ఏర్పాటుచేశారు. ముందస్తు అనుమతి లేకుండా మానవహారం ఏర్పాటుచేయకూడదని సీఐ పేర్కొనడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. విద్యార్ధులంతా ఒక్కసారిగా డౌన్..డౌన్...సీఐ అంటూ నినాదాలు చేశారు. అనంతరం మానవహారాన్ని విరమించి కళాశాల వద్దకు చేరుకుని విద్యార్థులు నిరాహార దీక్ష చేపట్టారు. -
వ్యవసాయ వర్సిటీ ఏర్పాటు చేయండి
తిరుపతి వాసుల డిమాండ్ ఇక్కడ వర్సిటీ లేకుంటే నష్టపోతామంటున్న రైతులు, శాస్త్రవేత్తలు యూనివర్సిటీక్యాంపస్: రాయలసీమ కరువు ప్రాంతం. ఇక్కడి పంటలు, నేల స్వభావం, వ్యవసాయ పద్ధతులు, దిగుబడులు, వ్యవసా య విధానం కోస్తాంధ్రతో పోల్చితే విభిన్నం గా ఉంటుది. ఈ నేపథ్యంలో రాయలసీమ నాలుగు జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల తో కలిపి తిరుపతిలో ప్రత్యేక వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని రాయలసీ మ ప్రాంత ఐక్యకార్యాచరణ సమితి చాలా కాలంగా ఉద్యమిస్తోంది. ప్రభుత్వం మాత్రం గుంటూరు-విజయవాడ మధ్య వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. దీన్ని తిరుపతికి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతులు వ్యతిరేకిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఆచార్య ఎన్ జీ. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రాష్ర్ట విభజన నేపథ్యంలో తెలంగాణకు వెళ్లింది. సుమారు రూ.60 వేల కోట్ల విలువైన భూము లు, భవనాలు, ఆధునిక వ్యవసాయ పరిశోధన స్థానం తెలంగాణకు పరిమితం కావడంతో సీమాంధ్ర ప్రాంతం తీవ్రంగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో వేరొక వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. గతంలో మూడు చోట్ల.. రాష్ట్ర విభజనకు ముందు 2004 వరకు ఉద్యానవన, పశుసంవర్థక, వ్యవసాయ విభాగాల న్నీ ఒకే విశ్వవిద్యాలయంగా హైదరాబాద్ కేం ద్రంగా ఉన్నాయి. 2005లో తిరుపతిలో శ్రీవెం కటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీని, 2009లో తాడేపల్లి గూడెం సమీపంలోని వెంకట్రామన్న గూడెంలో ఉద్యానవన యూనివర్సిటీని ఏర్పా టు చేశారు. రాష్ట్రం విడిపోతున్న దశలో ఉద్యానవన, పశుసంవర్థక, వ్యవసాయ విభాగాన్ని కలిపి మూడు చోట్లా ప్రాంతీయ వ్యవసాయ విశ్వవిద్యాలయాలుగా ఏర్పాటు చేయాలన్న ప్రయత్నం జరిగింది. అయితే ఇది కార్యరూపం దాల్చలేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు తిరుపతిలోని వెటర్నరీ, వెంకట్రామన్న గూడెంలోని హార్టికల్చరల్ మిగిలాయి. ఈ నేపథ్యంలో రెండు ప్రాంతాలకు చెరొక ప్రాంతీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని తిరుపతికి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు కోరుతున్నారు. తిరుపతి అన్ని విధాలా అనుకూలం వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చే యడానికి తిరుపతి అన్ని విధాలా అనుకూలం. తిరుపతి ఎస్వీ వ్యవసాయ కళాశాలతో పాటు ప్రాంతీయ పరిశోధనాస్థానం ఉన్నాయి. కళాశాల ప్రాంగణంలో పరిశోధకులకు, పంటలు సాగుచేయడానికి పొలాలు ఉన్నాయి. చీని, నిమ్మ పరిశోధనా స్థానాలు ఉన్నాయి. కాబట్టి రాయలసీమ ప్రాంతానికి సంబంధించి తిరుపతిలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి. - టి.ఆదికేశవులు రెడ్డి, వైఎస్సార్ సీపీ, రైతు విభాగం జిల్లా కన్వీనర్ మూడు విశ్వవిద్యాలయాలను కలపాలి వ్యవసాయ, పశువైద్య, ఉద్యానవన పంటలకు సంబంధించిన విశ్వవిద్యాలయాలను ఒకే గూటికి తెచ్చి తిరుపతిలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి. కోస్తాంధ్రతో పోల్చితే రాయలసీమలో పంటల సరళి, వాతావరణం, నేల స్థితి వేరుగా వుంటాయి. అందువల్ల ఇక్కడ ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తే ఇక్కడి అవసరాలకు అనుగుణంగా ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చు. - డాక్టర్ ఎ.రామకృష్ణారావు, ప్రధాన కార్యదర్శి, రాయలసీమప్రాంత ఐక్య కార్యాచరణ సమితి