సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని డెరైక్టరేట్ ఆఫ్ ఆయిల్‌సీడ్స్ రీసెర్చ్‌లో మంగళవారం ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ పి.జి. కృష్ణ స్మారకోపన్యాసం జరుగనుందని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం తెలిపింది. వ్యవసాయాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన శాస్త్రవేత్త డాక్టర్ పి.జి. కృష్ణ స్మారకార్థం నిర్వహిస్తున్న ఈ సదస్సులో ఢిల్లీకి చెందిన నేషనల్ రెయిన్‌ఫెడ్ అథారిటీ సీఈవో డాక్టర్ జె.ఎస్. శర్మ కీలకోపన్యాసం చేస్తారని శనివారం వర్సిటీ ఈ మేరకు ఒక ప్రకటనలో పేర్కొంది.
రేపటి నుంచి ఇండియన్ సొసైటీ ఆఫ్ సోషల్ సెన్సైస్ సదస్సు
ఇండియన్ సొసైటీ ఆఫ్ సోషల్ సెన్సైస్ 79వ వార్షిక సదస్సు సోమవారం నుంచి జరుగనుందని హైదరాబాద్ చాప్టర్ ఇండియన్ సొసైటీ ఆఫ్ సాయిల్ సైన్స్ అధ్యక్షులు డాక్టర్ పి.చంద్రశేఖర్‌రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సును వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య ప్రారంభిస్తారు. నాలుగు రోజులు జరిగే ఈ సదస్సుకు 500 మంది హాజరు కానున్నారు.
25న డాక్టర్ పి.జి. కృష్ణ స్మారకోపన్యాసం
Published Sun, Nov 23 2014 3:18 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement