'హైకమాండ్ డైరెక్షన్ లో సీఎం కిరణ్'
కాంగ్రెస్ హైకమాండ్ డైరెక్షన్ లో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నడుస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎక్కువ మంది జాతీయ నేతలు విభజనను వ్యతిరేకిస్తున్నారు అని అంబటి అన్నారు.
ఢిల్లీ అఖిలపక్ష సమావేశంలో చిన్న రాష్ట్రాలకు మద్దతిచ్చే బీజేపీ, త్రునముల్ కాంగ్రెస్, సమాజ్‌వాద్ పార్టీ లాంటి జాతీయ పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయని అంబటి తెలిపారు. దేశ వ్యాప్తంగా తెలంగాణ బిల్లును వ్యతిరేకించండానికి కృషి చేసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని ఆయన అన్నారు. చంద్రబాబు విభజనకు వ్యతిరేకం కాదు, విభజనకు అనుకూలంగా మాట్లాడుతున్నాడని సమైక్యవాదులు గమనించాలి ఆయన సూచించారు.
అందరితో మాట్లాడిన తర్వాతే రాష్ట్రాన్ని విభజించాలంటున్న చంద్రబాబు.. తన సొంత పార్టీ నేతలనే ఒకతాటిపైకి తేలేక పోతున్నాడు అంబటి విమర్శించారు. రాష్ట్రంలో ప్రభంజనాన్ని చూసి తట్టుకోలేక చంద్రబాబు బీజేపీతో పొత్తుకు వెంపర్లాడుతున్నాడు ఆయన ఎద్దేవా చేశారు. గతంలో బీజేపీతో పొత్తు చారిత్రక తప్పిదం అన్న బాబుకు సిగ్గులేకున్నా.. బీజేపీకి సిగ్గు ఉండాలి అని అన్నారు.
2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని.. వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విభజన వాదన అనేది లేకుండా చేస్తామన్నారు. దొంగ సమైక్యవాదులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ కలిసి వెళ్లదు స్పష్టం చేశారు. సోనియా మొహానికి సీఎం రాజీనామా కొట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అన్నారు.
విభజనవాదంతో కాంగ్రెస్, సమైక్యవాదంతో సీఎం కిరణ్ డ్రామాలాడుతున్నారని అన్నారు. రాష్ట్ర విభజన జరగకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతుంది అంబటి అన్నారు. ఆదాల ప్రభాకర్‌రెడ్డితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢీల్ కుదిరిందని చేసిన ఓ బఫూన్ అన్న మాటలను పట్టించుకోవద్దు ఆయన సూచించారు. 2014 ఎన్నికల తర్వాత హీరోలెవరో జీరోలెవరో తేలిపోతుంది అంబటి రాంబాబు అన్నారు.