‘అక్కడో డాన్స్‌ ఇక్కడో డాన్స్‌ వేయడానికి ఇదేమైనా సినిమానా?’ | Minister Ambati Rambabu Slams Pawan Kalyan | Sakshi
Sakshi News home page

‘అక్కడో డాన్స్‌ ఇక్కడో డాన్స్‌ వేయడానికి ఇదేమైనా సినిమానా?’

Published Sun, Nov 26 2023 8:35 PM | Last Updated on Sun, Nov 26 2023 9:25 PM

Minister Ambati Rambabu Slams Pawan Kalyan - Sakshi

సాక్షి, తాడేపల్లి: తెలంగాణలో బీజేపీతో.. ఏపీలో టీడీపీతో పొత్తు కొనసాగిస్తున్న పవన్‌ కళ్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.  పవన్‌ కళ్యాణ్‌ నువు రాజకీయ విటుడివా..?,  బ్రోకర్‌వా..? అంటూ మండిపడ్డారు. పవన్‌ కళ్యాణ్‌ ఈ రాజకీయ వ్యభిచారం ఏమిటో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు అంబటి. 
 

మంత్రి అంబటి ఇంకా ఏం మాట్లాడారంటే:

  • 19వ తేదీన విశాఖపట్నం హార్బర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మత్స్యకారుల బోట్లు దగ్ధమయ్యాయి.
  • మూడు రోజుల్లో నష్టపరిహారాన్ని అందించాం:
  • సుమారు 30 బోట్లు పూర్తిగా ఆహుతయ్యాయి. మరో 19 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 
  • వెంటనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చాలా స్పీడ్‌గా స్పందించారు.
  • ఎవరైతే అగ్ని ప్రమాదంలో బోట్లు కోల్పోయారో వారిని ఆదుకోవాలని ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. 
  • బోటు విలువలో 80 శాతం ఇవ్వాలని నిర్ణయించి తక్షణమే ఎటువంటి ఆలస్యం లేకుండా చర్యలు తీసుకున్నారు. 
  • 19వ తేదీన అగ్నిప్రమాదం జరిగితే వెంటనే అంచనా వేసి చాలా వేగంగా 3 రోజుల్లోనే వారందరికీ చెక్కులు పంపిణీ చేశారు. 
  • సుమారు రూ.7.11 కోట్ల చెక్కులు వారికి అందజేసి ఆదుకున్న ప్రభుత్వం ఇది. 
  • నష్టపరిహారం ఇచ్చి వారి జీవితాల్లో నష్టం లేకుండా చేసి..వారు మళ్లీ తమ వృత్తిని చేసుకునేందుకు జగన్‌ గారు పెద్ద మనసుతో సాయం చేశారు. 
  • ఇంత స్పీడుగా నష్టపరిహారం ఇచ్చిన ప్రభుత్వాలు లేవని చాలా మంది ప్రశంసించారు. 

నాలుగో భార్య విడాకులివ్వకపోయినా దానికి కారణం జగన్‌ గారేనంటాడు

  • ఇదిలా ఉంటే..పొగడక పోతే పొగడక పోయారు. కొంత మంది ఆఘమేఘాలపై వచ్చి మమ్మల్ని తిట్టే కార్యక్రమం, ధూషించే  కార్యక్రమం చేపట్టారు. 
  • ఆఘమేఘాలపై పవన్‌ కల్యాణ్‌ వచ్చి ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున పంపిణీ చేశారు. 
  • మంచిదే..కానీ సీఎం జగన్‌ను ప్రభుత్వాన్ని దూషించే కార్యక్రమం చేపట్టాడు. 
  • చివరికి ఆయన స్పెషల్‌ ఫ్లైట్‌ సమయానికి రాలేదట..దానికి కూడా జగన్‌ గారే కారణమంటున్నాడు.  
  • ఈ రాష్ట్రంలో ఏది జరిగినా దానికి కారణం జగన్‌ గారే అనడం పవన్‌ కల్యాణ్‌కు అలవాటు అయిపోయింది. 
  • ఆయనకు గెడ్డం బాగా పెరిగినా, గెడ్డంలో మెరుపు వెంట్రుక వచ్చినా... చివరికి జలుబు చేసినా జగన్‌ గారే కారణం అంటున్నాడు. 
  • చివరికి ఆయన నాలుగో భార్య వద్ద నుంచి విడాకులు సక్రమంగా రాకపోయినా దానికి జగన్‌ గారే కారణమనే అలవాటు ఆయనకు వచ్చింది. 
  • నీకు కక్ష, కార్పణ్యం ఉండొచ్చు...చంద్రబాబును మళ్లీ అధికారంలోకి తీసుకురావాలనే తపన ఉండొచ్చు. 
  • మంచి చేసిన జగన్‌ గారిని దూషిస్తే మాత్రం ప్రజలు సహించరు. 
  • మీరు స్పెషల్‌ ఫ్లైట్‌ వచ్చినా, రూ.50వేలు ఇచ్చినా, లింగమనేని వారు స్థలం ఇస్తే దానిలో మీరు ఇళ్లు కట్టినా అవన్నీ ప్యాకేజీ సొమ్ము తప్ప నీ కష్టార్జితం కాదు. 
  • లింగమనేని ద్వారానే, మనోహర్‌ ద్వారానే చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజీ తీసుకుని నువ్వు మాట్లాడుతున్నావు. 
  • చంద్రబాబు ప్యాకేజీ ఇవ్వడం, నువ్వు స్పెషల్‌ ఫ్లైట్‌లో రావడం, మనోహర్‌ నీకొక స్లిప్‌ తీసుకొస్తే దానిలో ఉన్న బాష మాట్లాడుతున్నారు. 

ఈ రాష్ట్రానికి నీకు ఏం సంబంధం పవన్‌ కల్యాణ్‌..?

  • పవన్‌ కల్యాణ్‌..నీకు ఈ రాష్ట్రానికి ఏమిటయ్యా సంబంధం? 
  • ఈ రాష్ట్రంలో నువ్వు ఉండవు..ఈ రాష్ట్రంలో నీకు సొంత ఊరే లేదు. 
  • కాసేపు బాపట్ల అంటావ్‌..కాసేపు చీరాల అంటావ్‌...కాసేపు గుంటూరు అంటావ్‌
  • కనీసం సొంత ఇళ్లు కూడా లేదు...ఓటుందా అంటే ఓటు కూడా లేదు. 
  • అసలు నీ భార్యలు పిల్లలు ఎక్కడుంటారు..? వాళ్లు కూడా ఈ రాష్ట్రంలో లేరు. 
  • చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజీ తీసుకుని వచ్చి జగన్‌ గారిని విమర్శించి వెళ్లడం తప్ప ఈ రాష్ట్రంతో నీకేంటి సంబంధం..? 
  • అసలు ఎక్కడ పోటీ చేస్తావో కూడా తెలియదు. 
  • ప్యాకేజీ తీసుకుంటావ్‌..వస్తావు..దూషిస్తావ్‌..వెళ్తూ దుర్మార్గపు రరాజకీయం చేస్తున్నావు. 
  • ఈ రాష్ట్రంలోని నీ సామాజిక వర్గాన్ని మాత్రం చంద్రబాబుకు తాకట్టు పెడుతున్నావు. 
  • చంద్రబాబు గారికి నీ సామాజిక వర్గాన్ని తాకట్టు పెట్టి..దాని ద్వారా ప్యాకేజీ తీసుకుని జగన్‌ గారికి వ్యతిరేకంగా మాట్లాడి చంద్రబాబును బలోపేతం చేయాలనే కార్యక్రమంలో నిమగ్నమవ్వడం దురదృష్టకరం
  • నీలా సామాజికవర్గం మొత్తాన్ని చంద్రబాబు చెప్పులు మోయించాలనుకుంటున్నావ్‌..:
  • నీ, నా సామాజిక వర్గం చంద్రబాబు చేతుల్లో నలిగిపోయిన సామాజికవర్గం. 
  • వంగవీటి రంగా గారిని అతి దారుణంగా హత్య చేసిన చంద్రబాబుకు నీ సామాజికవర్గాన్ని మొత్తాన్ని తాకట్టు పెట్టి బానిసలను చేయాలని చూస్తున్నావు. అసలు నీకు సిగ్గుందా? 
  • నువ్వు బానిస బతుకు బతుకుతున్నావు..చంద్రబాబు చెప్పులు మోస్తున్నావు..బానిసగా వ్యవహరిస్తున్నావు. 
  • బానిసగా వ్యవహరిస్తూ చెగువీరా అంటావ్‌..సుబాష్‌ చంద్రబోస్‌ అంటావు..వీరుడంటూ మాట్లాడుతున్నావు. 
  • నీ, నా సామాజికవర్గాన్ని బానిసలుగా చిత్రీకరించి చంద్రబాబు, లోకేశ్‌ పల్లకి మోయించాలనే నీ ప్రయత్నం విఫలమవుతుంది. 
  • ఎందుకంటే పౌరుషం కలిగిన సామాజికవర్గం మాది..ఆ సామాజికవర్గాన్ని నువ్వు తాకట్టు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నావు. 
  • నీలాంటి బానిసలను నాయకులుగా గుర్తించదు నా సామాజికవర్గం. 
  • వీరుడుగా పోరాడిన వారిని గుర్తిస్తుంది తప్ప ఒకరి చెప్పులు మోసి, కాళ్లు పట్టుకుని, పల్లకి మోసే నీలాంటి వ్యక్తులను నాయకులుగా గుర్తించదు.
  • తాత్కాలికంగా నీ సినిమాల్లో వేషాలు చూసి కాసేపు మోసపోతే మోసపోవచ్చు కానీ నువ్వు చేస్తున్న పనికి ఈ సామాజికవర్గం మోసపోదు. 
  • నీకు ఒక స్థిరత్వం లేదు..అవగాహన లేదు..రాజకీయాల్లో ఎప్పుడు ఏం చేస్తావో తెలియదు. 
  • చంద్రబాబు నిన్ను లోకేశ్‌ కంటే బాగా చూసుకుంటున్నాడు. 
  • అప్పుడప్పుడు లోకేశ్‌ అయినా బాబుపై తిరగబడతాడేమో కానీ..నువ్వు మాత్రం తిరగబడవు. 
  • ఏ స్లిప్పు రాస్తే అది..ఏది చెబితే అది చేసే దుస్థితికి నువ్వు దిగజారిపోయావు. 
  • నువ్వు దిగజారితే దిగజారావు..నీతో పాటు నీ సామాజికవర్గాన్ని కూడా దిగజార్చాలని ప్రయత్నం చేస్తున్నావు. 
  • టీడీపీ చెప్పులు మోయించాలని నువ్వు చేసే ప్రయత్నం నీ, నా సామాజికవర్గం అంగీకరించదు. 
  • నువ్వు సామాజికవర్గాన్ని ఉద్దరించడానికి వచ్చిన వాడివి కాదు. 
  • నువ్వు ఈ జాతిని, ఈ సామాజికవర్గాన్ని అమ్ముకుని బతకాలని వచ్చిన వాడివి. 
  • అదే ఈ పది ఏళ్ల చరిత్రలో ప్రజలకు, సామాజికవర్గానికి అర్ధమైంది. 

పవన్‌ కల్యాణ్‌ నువ్వు రాజకీయ నటుడివా..? విటుడివా..?

  • అసలు నువ్వు రాజకీయ నాయకుడివా..? రాజకీయ నటుడివా?
  • రాజకీయ విటుడివా..? లేక రాజకీయ బ్రోకర్‌వా..? 
  • అసలు నీ వ్యక్తిత్వం ఏంటి? తెలంగాణ రాజకీయాల్లో నీ పాత్ర ఏంటి?
  • తెలంగాణలో నువ్వు ఎవరికి మద్దతు పలుకుతున్నావు..చంద్రబాబు ఎవరికి మద్దతు పలుకుతున్నాడు...?
  • నువ్వేమో బీజేపీ పక్కన నీ జెండా కట్టావు. చంద్రబాబు జెండా మాత్రం కాంగ్రెస్‌ పక్కన కట్టాడు
  • చంద్రబాబు కామ్‌గా ఇంట్లో కూర్చుంటే కాంగ్రెస్‌ మీటింగుల్లో పచ్చ జెండాలు పైకి లేస్తుంటాయి
  • నీ జెండాలేమో బీజేపీలో డైరెక్ట్‌గా లేస్తున్నాయి
  • అక్కడ ఒక నాటకం..ఇక్కడ ఒక నాటకం..ఏంటయ్యా అసలు నీ బతుకు..? 
  • ఇంత నీచమైన రాజకీయాలు చేస్తున్న వ్యక్తి చంద్రబాబు అయితే దానికన్నా మించిన వ్యక్తి పవన్‌ కల్యాణ్‌
  • పవన్‌ కల్యాణ్‌ అసలేంటి ఈ రాజకీయ వ్యభిచారం..? 
  • అక్కడ బీజేపీ..ఇక్కడ తెలుగుదేశం...వాళ్లకేమో అక్కడ కాంగ్రెస్‌..ఇక్కడ నువ్వు
  • అసలు నువ్వు బీజేపీకి సెకండ్‌ సెటప్‌వా..? లేక టీడీపీకి సెకండ్‌ సెటప్‌వా..? 
  • నీ బతుకేంటి..వ్యవహారమేంటో తేల్చుకోవాల్సిన సమయం అసన్నమైంది
  • ప్రజలు కూడా ఈ వ్యవహారాలను గమనించాల్సిన సమయం ఆసన్నమైంది
  • పవన్‌ కల్యాణ్‌ కేవలం ప్యాకేజీ తీసుకుని మహత్తర నాటకాలు ఆడుతున్నాడు

నువ్వు చేసే రాజకీయాలపై నాతో చర్చకు సిద్ధమా?

  • ఇప్పటికైనా నువ్వు చేస్తున్న రాజకీయాల పట్ల నోరు విప్పి మాట్లాడు. 
  • దమ్ముంటే నాతో చర్చకు రా..
  • ఇదేమన్నా సినిమా అనుకున్నావా..? అక్కడో డాన్స్‌ ఇక్కడో డాన్స్‌ వేయడానికి? 
  • ప్రజలు కొద్దోగొప్పో నిన్ను నమ్ముకున్నారు..వాళ్లందరినీ నట్టేట్లో ముంచే ప్రయత్నం చేస్తున్నావు. 
  • కేవలం క్యాష్‌ తీసుకుని పనిచేసే వ్యక్తిగా నువ్వు తయారయ్యావు. 
  • ఆయన పీకే కాదు..కేకే..కేకే అంటే కిరాయి కల్యాణ్‌వి. 
  • నువ్వు కిరాయి తీసుకుని ఎంత దారుణానికైనా సిద్ధపడతావు. 
  • కిరాయి రౌడీలు కిరాయి తీసుకుని మనుషులను హత్య చేస్తారు. 
  • అదే విధంగా నువ్వు కిరాయి తీసుకుని నువ్వు రాజకీయంగా హత్యలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. 

ఎక్కడ నష్టం జరిగినా తక్షణమే స్పందించేది మా జగనే

  • మేం రూ.5 లక్షలు మాత్రమే ఇచ్చామని ఆరోపిస్తున్నారు. మేం చాలా పారదర్శకంగా చెక్‌లు ఇచ్చాం. ఎవరికి ఎంత ఇవ్వాలో చెప్పి మరీ ఇచ్చాం. 
  • ఇప్పుడే కాదు..ఎప్పుడు ప్రజలకు నష్టం జరిగినా తక్షణమే స్పందించే ప్రభుత్వం జగన్మోహన్‌ రెడ్డి గారి ప్రభుత్వం. 
  • గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే కనీసం స్పందించావా పవన్ కల్యాణ్..? 
  • ఇప్పుడొచ్చి బోట్లు దగ్ధమైతే..మేం సాయం చేస్తే మమ్మల్ని కిరాయి కల్యాణ్ దూషించడమేంటి?  
  • 45 సంవత్సరాల దోపిడీ చేసిన చంద్రబాబు పల్లకీ మోయాలనే వ్యక్తి పవన్‌ కల్యాణ్‌. 
  • ఆయన చెప్పినట్లు నా సామాజికవర్గం చంద్రబాబు చెప్పులు మోయమంటే మోయడానికి సిద్ధంగా లేదు. 

ప్రశ్నలు–సమాధానాలు

  • విశాఖలో ఆయన పంచింది ప్యాకేజీ సొమ్మే
  • పవన్‌ కల్యాణ్‌ పగటి కలలు కంటుంటారు. హైదరాబాద్‌లో పడుకుని షూటింగ్‌ అయ్యాక కలలు కంటారు. 2019 మందు జగన్‌ గారు ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడు అంటూ కలలు కన్నాడు. 
  • ఆయనకు రాజకీయాలు తెలియవు..ఆయన రాజకీయ నాయకుడు కాదు. కిరాయి తీసుకుని పనిచేసే కల్యాణ్‌. అయన్ను పట్టుకుని ఎవరైనా వెళితే కుక్క తోకపట్టుకుని గోదావరి ఈదినట్లేనని ప్రజలకు చెప్తున్నా. 
  • దోచుకొచ్చిన సొమ్ము కాదది అంటున్నాడా..? అవును దోచుకొచ్చిన సొమ్ము కానే కాదు..అది ప్యాకేజీ సొమ్ము. ఇన్‌కం టాక్స్‌ ఎగ్గొట్టిన సొమ్ము. 
  • ఒక సారి ఇన్‌కం ట్యాక్స్‌ బహిర్గతం చేయమని అడుగుతున్నా. నాకు రోజుకు రూ.2 కోట్లు వస్తాయన్నాడు..తాను భగత్‌ సింగ్‌ కదా..బహిర్గతం చేయమనండి. 
  • అంతా సూట్‌ కేస్‌ సొమ్ము..స్లిప్‌ తీసుకుని ఆఘమోఘాలపై ఆ స్లిప్పులోనిది చదివి వెళ్లడం తప్ప మరొక పనిలేని వ్యక్తి పవన్‌ కల్యాణ్‌. 
  • పవన్‌ కల్యాణ్‌ గారికి రాజకీయాలు తెలియదు..జలయజ్ఞాన్ని ప్రారంభించింది రాజశేఖరరెడ్డి గారు. దోచుకున్నారు..దాచుకున్నారు అనే మాటలు నిజమైతే రెండో సారి వైఎస్సార్‌ని ఎన్నుకునేవారా? 
  • రాజశేఖరరెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత పిల్ల పవన్‌ కల్యాణ్‌కు ఉందా? 
  • పవన్‌ కల్యాణ్‌కి సూట్‌కేసులో డబ్బులు లెక్కేసుకోవడం, స్లిప్పులోది చదవడం తప్ప సొంత ఆలోచన లేదు..సొంత బుర్రలేదు. 

రేపటి నుంచి హాస్యభరిత కామిడీ గళం ప్రారంభం

  • ఆగిపోయిన హాస్య భరిత చిత్రం మళ్లీ ప్రారంభం కాబోతోంది. దాన్ని క్యామిడీ గళం అంటారో ఏమంటారో మీ ఇష్టం. 
  • అసలు ఎందుకు మొదలు పెట్టాడో..ఎందుకు ఆపేశాడో...ఎందుకు మొదలు పెడుతున్నాడో తెలియదు. 
  • ఈ అసలు పుత్రుడు చేసే కామిడీ రేపటి నుంచి అందరూ చూడొచ్చు. 
  • ఆయన ఎక్కడ నుంచి పడితే అక్కడ నుంచి పవన్‌ కల్యాణ్‌ ధైర్యం పొందుతుంటాడు. 
  • తెలంగాణ పోరాటం చూసి ధైర్యం పొందాడు..చెగువీరా పోరాటం చూసి ధైర్యం పొందానంటాడు. 
  • భగత్‌ సింగ్‌ను చూసి అంటాడు..అతన్ని ఎవరికైనా చూపిస్తే మంచిది. 
  • కమ్యూనిస్టులను చూసి ధైర్యం పొందాను అంటాడు..అప్పుడప్పుడు అడవుల్లోకి వెళ్దామనుకున్నాను అంటాడు. 

తెలంగాణలో కనీసం నీ పార్టీ అభ్యర్ధులకైనా చంద్రబాబు మద్దతిస్తున్నాడా..?

  • అక్కడ పోటీ చేస్తున్న వారు ఎందుకు నువ్వు ప్రచారానికి రావడం లేదని పవన్‌ కల్యాణ్‌ని అడగాలి. 
  • అక్కడకు వెళ్లడం కంటే ఇక్కడ దూషించడమే ముఖ్యం అనుకుంటున్నాడు..ఎందుకంటే ఇక్కడ క్యాష్‌ వస్తుంది.
  • అక్కడ చిత్తశుద్ధి లేని రాజకీయం..ఫలితాలు వచ్చాక అక్కడ ఎన్ని గెలుస్తాడో చూద్దాం. 
  • పవన్‌ కల్యాణ్‌ అసలు నీకు సిగ్గుందా? చంద్రబాబు కనీసం నీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న 8 మందికన్నా సపోర్ట్‌ చేస్తున్నాడా లేదా కనుక్కో. 
  • నాకు సపోర్ట్‌ చేయాల్సిన అవసరం లేదు..నాకు క్యాష్‌ ఇస్తే చాలు అంటే నీ ఇష్టం. 
  • తెలుగుదేశం.. కాంగ్రెస్‌ పార్టీకి బహిరంగంగా సపోర్ట్‌ చేస్తున్నది వాస్తవం. 
  • ఆ 8 మంది ఎందుకు నిలబడ్డారో వారైనా ఆలోచించుకోవాలి. 
  • తెలంగాణలో కేసీఆర్‌ మొదట గెలిచాడు..మేం ఓడిపోయావు..
  • రెండో సారి కేసీఆర్‌ గెలిచాడు..ఇక్కడ మేం గెలిచాం..దీన్ని బట్టి అక్కడ రాజకీయాలు వేరు..ఇక్కడి రాజకీయాలు వేరు అనేది గుర్తించాలి. 
  • అక్కడి రాజకీయాల ప్రభావం ఇక్కడ ఉండదు. 
  • అక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా వారితో మాకు సంబంధ బాంధవ్యాలుంటాయి. ఎందుకంటే పక్క రాష్ట్రం కాబట్టి. 
  • వారాహి కేవలం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే లైసెన్స్‌ ఉన్నట్లుంది. తెలంగాణాలో దానికి చంద్రబాబు లైసెన్స్‌ ఇచ్చినట్లు లేడు.  
  • జగన్‌ గారు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మాత్రమే తిరుగుతుంది కాబోలు. 
  • అక్కడ తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట ఎన్నికల ప్రచారానికి కూడా వారాహి వెళ్లడం లేదు. 
  • ఇది కేవలం చంద్రబాబు చెబితే చేసిన వారాహి కాబట్టి ఆయన డైరెక్షన్‌లో మాత్రమే నడుస్తుందని అర్ధం చేసుకోవాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement