సాక్షి, తాడేపల్లి: పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ(పాడా)పై గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ హరికిరణ్, పాడా అధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. పులివెందుల మెడికల్ కాలేజీ శంకుస్థాపన, పనుల పురోగతిని అధికారులు వైఎస్ జగన్‌కు వివరించారు. ఆగష్టుకల్లా టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టి త్వరితగతిన పూర్తిచేసి, ఈ సంవత్సరంలోగా మెడికల్ కాలేజీ పనులు ప్రారంభించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. జీఎన్‌ఎస్‌ఎస్ మెయిన్ కెనాల్-చక్రాయపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనుల పురోగతిపై ఆరా తీశారు. వీలైనంత త్వరగా పనులు గ్రౌండింగ్ కావాలని అధికారులతో అన్నారు. యుద్ధప్రాతిపదికన ఈనెలాఖరుకల్లా జ్యుడిషియల్ ప్రివ్యూ పూర్తిచేసి, టెండర్ల ప్రక్రియకు సిద్ధం కావాలని వైఎస్ జగన్ తెలిపారు.(అయిపోయిన పెళ్లికి బాజాలు కొట్టకు పవన్)
వేంపల్లి మండలంలోని అలవలపాడు, పెండ్లూరు చెరువు, జీఎన్‌ఎస్‌ఎస్ నుంచి పిబిసి కెనాల్‌కు రూ.46.5 కోట్లతో లిఫ్ట్ స్కీంకు పాలనాపరమైన అనుమతుల మంజూరుకు సీఎం ఆదేశించారు. పులివెందులలో అరటి స్టోరేజీ, ప్రాసెసింగ్ యూనిట్‌తోపాటు అనంతపురం, కడప వంటి అరటి సాగు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రాసెసింగ్ యూనిట్లు సిద్ధం చేయాలన్నారు. అరటి, టమాటా, బత్తాయి పంటల దిగుబడి సమయంలో సమస్యలు రాకూడదని సూచించారు. రైతులు నష్టపోకుండా శాశ్వత పరిష్కారం ఉండాలన్నారు. (టీడీపీ నేతల దీక్షలు వృధా: జేసీ దివాకర్‌రెడ్డి)
రాష్ట్రంలోని అన్ని ట్రిపుల్ ఐటీలలో పక్కదారి పట్టిన నిధులను, తిరిగి వెంటనే వెనక్కి తెచ్చే ప్రక్రియను మొదలుపెట్టాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. దేవుని కడప చెరువు సుందరీకరణ, రాజీవ్ మార్గ్ అభివృద్ధి పనుల నిధుల విడుదలకు ఆదేశించారు. రిమ్స్ ఆస్పత్రి అభివృద్ధిలో భాగంగా డా.వైఎస్సార్ క్యాన్సర్ ఆస్పత్రి, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, సైకియాట్రీ ఆస్పత్రులకు టెండర్ల ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీలు త్వరగా నియమించి మిల్లెట్‌ల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ఏపీ కార్ల్‌కు అనుబంధంగా అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ కాలేజీలతో పాటు, వ్యాక్సిన్ తయారీ యూనిట్‌ను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పులివెందులలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్కూల్ ఏర్పాటుపై దృష్టిపెట్టాలన్నారు. అరటి రీసెర్చ్ సెంటర్‌లో ట్రైనింగ్ వెంటనే ప్రారంభించాలని వైఎస్ జగన్ అధికారులతో అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment