ఏలూరు : బహుళ ప్రయోజనాలు అందించే పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తిచేసే విషయంలో ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు నాన్చుడు ధోరణి అవలంభిస్తున్నారు. ప్రాథమిక రంగం మిషన్‌పై విజయవాడలో శుక్రవారం 13 జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం ఒకరోజు సదస్సు నిర్వహించారు. ప్రాధాన్యత కలిగిన ఏడు సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందులో పోలవరం ప్రాజెక్టు లేకపోవడం అధికారులను విస్మయానికి గురి చేసింది. సీఎం పేర్కొన్న ఏడు సాగునీటి ప్రాజెక్టుల్లో పట్టిసీమ ఎత్తిపోతల పథకం, పోలవరం కుడి కాలువ పనులు మాత్రమే ఉన్నాయి. ఎట్టిపరిస్థితుల్లో జూలై నెలాఖరు నాటికి పోలవ రం కుడి కాలువ పనులు, ఆగస్టు 15 నాటికి పట్టిసీమ ఎత్తిపోతల తొలిదశ పనులను ప్రారంభించి నీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. గోదావరి పుష్కరాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుం దని, ఏర్పాట్లలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడాలని సీఎం సూచిం చారు. జిల్లాలో 16వేల ఎకరాల భూమిని పరిశ్రమలకు కేటాయించే అంశాన్ని కలెక్టర్ కె.భాస్కర్ సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.
తెరపైకి కిసాన్ కార్యక్రమం
ఏలూరు (టూ టౌన్) : రైతులకు ప్రభుత్వం అందించే ఎరువులు పక్కదారి పట్టకుండా, వ్యాపారుల అక్రమాలను అరికట్టేందుకు 2010లో మన జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన కిసాన్ కార్డు కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా విస్తరించాలని సీఎం చంద్రబాబు శుక్రవారం నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆదేశించారు. 2010లో మన జిల్లాలో అదనపు జాయింట్ కలెక్టర్‌గా పనిచేసి, ప్రస్తుతం సహకార శాఖ కమిషనర్‌గా వ్యవహరిస్తున్న మిరియాల వెంకట శేషగిరిబాబు ఈ పథకానికి అప్పట్లో రూపకల్పన చేశారు. ఎరువుల పంపిణీలో అక్రమాలు చోటుచేసుకుం టున్న వ్యవహారం కలెక్టర్ల సదస్సులో చర్చకు రాగా, 2010లో తాను కిసాన్ కార్డు కార్యక్రమం రూపొందించిన విషయాన్ని శేషగిరిబాబు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్న చంద్రబాబు దీనికి రూపకల్పన చేసిన శేషగిరిబాబును అభినందించారు. ఇదే విధానాన్ని రాష్ట్రమంతటా అమలు చేయాలని ఆదేశించారు.
శ్రీకారం చుట్టిందిలా
రైతుకు అవసరమైన మేరకు ఎరువుల్ని పంపిణీ చేయటంతోపాటు, వ్యాపారులు పక్కదారి పట్టించుకుండా చూసేందుకు కిసాన్ కార్డు కార్యక్రమం రూపొందించారు. తణుకు మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని అమలు చేసిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని అప్పట్లో భావించారు. కానీ.. అమలుకు నోచుకోలేదు. రైతు ఎంత విస్తీర్ణంలో ఏ పంట సాగు చేస్తున్నాడనే విషయాన్ని పట్టాదార్ పాస్ పుస్తకంఆధారంగా సేకరించి ఆ వివరాలను కంప్యూటరీకరించారు. సంబంధిత పొలానికి ఎంతమేర ఎరువులు అవసరమవుతాయో గుర్తిం చారు. ఒక్కొక్క రైతుకు యూనిక్ నంబర్ కేటాయించి కిసాన్ కార్డులిచ్చా రు. కార్మాగారాల నుంచి హోల్‌సేల్ వ్యాపారులు, వారినుంచి డీలర్లకు వచ్చే ఎరువుల స్టాక్‌ను కంప్యూటరీకరించి సర్వర్‌కు అనుసంధానం చేశారు. డీలర్, రైతు సెల్‌ఫోన్ నంబర్లను అనుసంధానం చేశారు. రైతు డీలర్ వద్దకు వెళ్లినప్పుడు అప్పటికే నమోదు చేసిన వివరాల ఆధారంగా ఎరువులు అందచేసేవారు. అయితే కౌలు రైతులు అధికంగా ఉండటంతో ఈ విధానం అప్పట్లో సత్పలితాలను ఇవ్వలేకపోయింది.
పోలవరం ప్రాజెక్ట్‌పై నాన్చుడే
Published Sat, Jun 27 2015 3:31 AM | Last Updated on Sun, Sep 3 2017 4:25 AM
Advertisement