
జగన్‌ను కలసిన ప్రయివేటు పాఠశాలల, కళాశాలల యాజమాన్య సంఘం సభ్యులు
రాయచోటి రూరల్: రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలను ప్రోత్సహిస్తూ తమను వేధిస్తోందని ప్రయివేటు పాఠశాలల, కళాశాలల యాజమాన్యం సంఘం నేతలు జననేత దృష్టికి తెచ్చారు. ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డు హౌసింగ్ కాలనీ వద్ద వారు జగన్‌ను కలసి తమ సమస్యలను విన్నవించారు. ప్రయివేటు పాఠశాలలకు విద్యుత్ కనెక్షన్లు కమర్షియల్ కేటగిరి –2 నుంచి కేటగిరి–7కు మార్చాలని, ఫైర్ రెన్యువల్‌ను ప్రతి సంవత్సరం కాకుండా పదేళ్లుకోసారి చేసుకునేలా వెసలుబాటు కల్పించాలని చెప్పారు. వారి సమస్యలను విన్న జగన్..తాము అధికారంలోకి రాగానే అన్నింటిని పరిష్కరిస్తామన్నారు.