
మావోయిస్టుల దాడిలో మృతి చెందిన పోలీసులు(ఫైల్)
మావోయిస్టులు, ఉగ్రవాదుల దాడుల్లో మృతి చెందినవారి కుటుంబాలకిచ్చే నష్టపరిహారాన్ని ప్రభుత్వం భారీగా పెంచింది.
హైదరాబాద్: మావోయిస్టులు, ఉగ్రవాదుల దాడుల్లో మృతి చెందినవారి కుటుంబాలకిచ్చే నష్టపరిహారాన్ని ప్రభుత్వం భారీగా పెంచింది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఈ దాడుల్లో ఎంపి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జడ్పీ చైర్పర్సన్లు చనిపోతే వారి కుటుంబాలకు ఇక నుంచి 35 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇస్తారు. తీవ్రంగా గాయపడితే 10 లక్షల రూపాయలు ఇస్తారు.
మండలాధ్యక్షుడు, జడ్పిటిసి, డిసిసి బ్యాంక్ చైర్మన్, మునిసిపల్ చైర్మన్, సర్పంచ్, ఎంపిటిసి, వార్డు మెంబర్ చనిపోతే 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇస్తారు. కానిస్టేబుల్, ఎస్ఐ చనిపోయినా 25 లక్షల రూపాయలు ఇస్తారు. సీఐ నుంచి ఆ పైస్థాయివారు చనిపోతే 30 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకూ అదేస్థాయిలో ఎక్స్ గ్రేషియా ఇస్తారు. సాధరణ పౌరులు చనిపోతే 10 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇస్తారు.