రాజధానికోసం పోరు | concern about on state capital | Sakshi
Sakshi News home page

రాజధానికోసం పోరు

Published Tue, Aug 19 2014 3:25 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 PM

రాజధానికోసం పోరు

రాజధానికోసం పోరు

కడప సెవెన్‌రోడ్స్ : రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో విద్యార్థులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు రవిశంకర్‌రెడ్డి మాట్లాడు తూ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనందున సీమ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభలో గళం విప్పాలన్నారు. సీమలో రాజధాని ఏర్పాటుపై చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు.
 
సీమ ప్రజల వాణిని అసెంబ్లీలో వినిపించాలన్నారు. సీమకు అన్యాయం జరుగుతున్నప్పటికీ ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. అసెంబ్లీని వేదికగా చేసుకొని ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు పోరాడాలన్నారు. లేదంటే ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకొని వెళ్లడానికి చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. ఆర్‌ఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు జయవర్దన్, ఉపాధ్యక్షుడు జకరయ్య, నాయకులు మల్లికార్జున, సుబ్బరాజు, నాగరాజు, నాయక్, ప్రసన్న తదితరులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement