పట్టుదలే అతడి విజయం
శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ (అనంతపురం) : ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం చిన్నబోయింది. పట్టుదల అతన్ని ముందుకు నడిపిస్తోంది. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండల కేంద్రానికి చెందిన తిమ్మప్పకు వైకల్యం కారణంగా రెండు చేతులూ పనిచేయని స్థితి. అలా అని అతడు ఆగిపోలేదు. కాళ్లనే తన అక్షరాయుధంగా మార్చుకున్నాడు. కాలితో చక్కగా రాస్తాడు. బీఏ ఉత్తీర్ణుడైన తిమ్మప్ప.. పోస్ట్ గ్రాడ్యుయేషన్(పొలిటికల్ సైన్స్)లో ప్రవేశం కోసం సోమవారం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (స్కూసెట్)కు హాజరయ్యాడు. కచ్చితంగా మంచి ర్యాంకు సాధిస్తాననే ధీమా వ్యక్తం చేశాడు.