గాంధీభవన్ తాకిన నిరసన సెగలు!
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ సీట్ల కేటాయింపులో తమకు న్యాయం జరగలేదంటూ పెద్ద ఎత్తున గాంధీభవన్‌కు నిరసన సెగలు తాకాయి. మైనారిటీలకు 12 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని డిమాండ్ మైనారిటీ సెల్ ఛైర్మన్ సిరాజుద్దీన్ డిమాండ్ చేశారు. ఒకవేళ సీట్లు ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తామని ఆయన హెచ్చరించారు.
ఇక టిక్కెట్లు రాని తెలంగాణ కాంగ్రెస్ నేతల అనుచరులు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మణెమ్మ కుమారుడికి ముషీరాబాద్ అసెంబ్లీ సీటు ఇవ్వాల్సిందేనంటూ కార్యకర్తలు గాంధీభవన్ లో నిరసన కార్యక్రమం చేపట్టారు.