జాతి సమగ్రతకు కాంగ్రెస్ తూట్లు పొడిచింది: పవన్ కళ్యాణ్ | Congress spoils National integrity, says Pawan Kalyan | Sakshi
Sakshi News home page

జాతి సమగ్రతకు కాంగ్రెస్ తూట్లు పొడిచింది: పవన్ కళ్యాణ్

Published Thu, Mar 27 2014 7:37 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

జాతి సమగ్రతకు కాంగ్రెస్ తూట్లు పొడిచింది: పవన్ కళ్యాణ్ - Sakshi

జాతి సమగ్రతకు కాంగ్రెస్ తూట్లు పొడిచింది: పవన్ కళ్యాణ్

విశాఖపట్నం: రాష్ట్ర విజభన అంశంలో పిచ్చిపిచ్చిగా వ్యవహరించిన కాంగ్రెస్ ను కూకటి వేళ్లతో పీకివేయాలని జనసేన పార్టీ నేత పవన కళ్యాణ్ పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో ప్రియదర్శిని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయాలపై కడుపు మండి రాజకీయాల్లోకి వచ్చాను అని అన్నారు. రాష్ట్ర విభజన అంశంలో ఎన్నడూ, ఎవరూ ఆడని వికృత క్రీడను కాంగ్రెస్ ఆడిందన్నారు. పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని పవన్ స్పష్టం చేశారు. అవినీతితో నిండిన రాజకీయాలను తరిమికొట్టాలంటే బలమైన సిద్దాంతాలు కలిగిన పార్టీ కావాలి ఆయన అన్నారు. 
 
150 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ మాది అని కాంగ్రెస్ వారంటుంటారు. 150 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ అంటే మా తాతలు నేతులు తాగారు..మా మూతుల వాసన చూడండి అనే సామెత గుర్తుకు వస్తుందని..  గాంధీ పేరు పెట్టుకున్నంత మాత్రానా అసలైనా గాంధీలు కారని పవన్ అన్నారు. భారత జాతి సమగ్రతకు కాంగ్రెస్ పార్టీ తూట్లు పొడిచారని పవన్ నిప్పులు చెరిగారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement