చిత్తూరు: పోలీస్ శాఖలో ఖాళీలను భర్తీ చేయనున్నట్టు ఏపీ డీజీపీ జేవీ రాముడు తెలిపారు. చిత్తూరులో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఖాళీగా ఉన్న10 వేల కానిస్టేబుల్ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామన్నారు. కాగా ఎర్రచందనం స్మగ్లింగ్ కు చిత్తూరు గేట్ వేగా ఉందన్నారు.
ఇతర రాష్ట్రాల అధికారుల సాయంతో ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధిస్తామన్నారు.ఎర్రచందనం దొంగల పూర్తి సమాచారంతో కూడిన సాప్ట్ వేర్ ను ప్రారంభించినట్టు డీజీపీ వివరించారు. RR యాక్ట్ అమలుకు ప్రయత్నిస్తున్నట్టు ఆయన తెలిపారు.